తనను కాదని వేరే వివాహం చేసుకుందని...యువతిని పెళ్లి జరిగిన రోజే..దారుణంగా...

దీంతో ఆగ్రహం చెందిన నిందితుడు విశాల్ ఎలాగైనా తనతో వచ్చేయాలని, వేరే వ్యక్తితో వివాహం చేసుకోవద్దని ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ గత వారం యువతికి వివాహం జరిగిపోయింది.

news18-telugu
Updated: December 14, 2019, 6:33 PM IST
తనను కాదని వేరే వివాహం చేసుకుందని...యువతిని పెళ్లి జరిగిన రోజే..దారుణంగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లి అయిన మూడో రోజే యువతిని కత్తితో పొడిచిన ఘటన థానేలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిందితుడు విశాల్ ఖడే థానే జిల్లాలోని వాడోల్ గ్రామానికి చెందిన వాడు. అయితే బాధితురాలు అదే జిల్లాలో అంబర్ నాథ్ ప్రాంతంలో నివాసముంటోంది. కాగా ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి తన ఇంట్లో ప్రేమకు అంగీకారం దక్కకపోవడంతో, మరో వ్యక్తితో వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకుంది. దీంతో ఆగ్రహం చెందిన నిందితుడు విశాల్ ఎలాగైనా తనతో వచ్చేయాలని, వేరే వ్యక్తితో వివాహం చేసుకోవద్దని ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ గత వారం యువతికి వివాహం జరిగిపోయింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన విశాల్ మారణాయుధంతో పెళ్లి మండపానికి వచ్చాడు. ఈ క్రమంలో అదను చూసిన నిందితుడు, బాధిత యువతిని ఏకాంత ప్రదేశంలో గుర్తించి కత్తితో పోట్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్రగాయాలతో ఉన్న యువతిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స చేస్తున్నారు. అనంతరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, నిందితుడు పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగుతోంది.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>