బావపై మోజు పడిన మరదలు.. అక్క అడ్డుగా ఉందని..

Crime News: అభిలాషకి కొద్ది నెలల కిందట పెళ్లై, గర్భం దాల్చింది. ఆమె గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చింది. అయితే ఆమె భర్తపై షతక్షి వ్యామోహం పెంచుకుంది. ఎలాగైనా అతడిని దక్కించుకోవాలనుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 31, 2019, 4:04 PM IST
బావపై మోజు పడిన మరదలు.. అక్క అడ్డుగా ఉందని..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 31, 2019, 4:04 PM IST
అక్క భర్తపై మనసు పడిందా యువతి.. ఎలాగైనా బావను దక్కించుకోవాలనుకుంది.. కానీ, అక్క అడ్డుగా ఉండటంతో ఆమెను ఎలాగైనా తప్పించాలనుకొంది.. గర్భంతో ఉందని కూడా చూడకుండా అక్కను దారుణంగా పొడిచి చంపిందో చెల్లి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా కైత్రాలో 27వ తేదీన చోటుచేసుకుంది. అభిలాష(27), షతక్షి (19) అక్కాచెల్లెళ్లు. అభిలాషకి కొద్ది నెలల కిందట పెళ్లై, గర్భం దాల్చింది. ఆమె గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చింది. అయితే ఆమె భర్తపై షతక్షి వ్యామోహం పెంచుకుంది. ఎలాగైనా అతడిని దక్కించుకోవాలనుకుంది. బావతో పెళ్లి కావాలంటే అడ్డుగా ఉన్న అక్కను తొలగించుకోవాలని తలచి, అదను కోసం వేచి చూసింది. అభిలాష స్నానానికి బాత్రూంలోకి వెళ్తుండగా, అక్కపై కత్తితో దాడి చేసింది. మెడపై, కడుపులో విచక్షణ రహితంగా పొడిచింది.

బాధితురాలు కేకలు పెట్టడంతో అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని, రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న అభిలాషను ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు వెల్లడించారు. కాగా, అభిలాషను హత్యచేసిన షతక్షి.. తప్పించుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అక్కపై షతక్షి హత్యాయత్నం చేయడం ఇది మూడోసారి అని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలం కాగా, మూడోసారి హత్య చేసినట్లు వెల్లడించారు.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...