హోమ్ /వార్తలు /క్రైమ్ /

Youtube: యూట్యూబ్‌లో ప్రసవం వీడియోలు చూసి బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. షాకింగ్ నిజం ఏంటంటే..

Youtube: యూట్యూబ్‌లో ప్రసవం వీడియోలు చూసి బిడ్డకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక.. షాకింగ్ నిజం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేరళలోని మలప్పురంలో 17 ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలు చూసి తనకు తానుగా ప్రసవం చేసుకుంది. ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. అక్టోబర్ 20న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

మలప్పురం: కేరళలోని మలప్పురంలో 17 ఏళ్ల బాలిక యూట్యూబ్ వీడియోలు చూసి తనకు తానుగా ప్రసవం చేసుకుంది. ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. అక్టోబర్ 20న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడానికి కారణం ఎదురింట్లో ఉన్న 21 ఏళ్ల యువకుడని పోలీసు విచారణలో తేలింది. ఆమెపై అత్యాచారం చేసిన నిందితుడు యూట్యూబ్‌లో ప్రసవం వీడియోలు చూసి బిడ్డను కనాలని ఆమెకు సలహా ఇచ్చాడు. అంతేకాదు.. బొడ్డుతాడు ముడివేసి కట్ చేయడం ఎలాగో కూడా యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఆ బాలిక అలానే చేసింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మలప్పురం ప్లస్ టూ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని, ఆమె ఇంటికి ఎదురుగా ఉండే 21 ఏళ్ల యువకుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొన్నాళ్లకు ఇద్దరి పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆ యువకుడు పలుమార్లు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. అక్టోబర్ 20న ఆ బాలిక బిడ్డకు జన్మనిచ్చింది.

ఇది కూడా చదవండి: Doctor: ఇతనో డాక్టర్.. ఏం చేశాడో తెలిస్తే కడుపు రగిలిపోతుంది.. ఇలా తయారవుతున్నారేంటో రోజురోజుకీ..

అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా ఉండేందుకు ఆ బాలిక పురిటి నొప్పులను భరిస్తూ యూట్యూబ్‌లో చూసి తనకు తానే సహజ ప్రసవం చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఆ బాలిక గర్భంతో ఉన్న సంగతి తల్లిదండ్రులకు తెలియకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలలు నిండి బిడ్డను కనేంత వరకూ ఆమె తల్లికి కూడా తెలియకపోవడం ఏంటనే సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే పోలీసుల విచారణలో ఈ సందేహానికి సమాధానం దొరికింది. ఆ బాలిక తల్లికి కళ్లు కనబడవని తెలిసింది. తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడని విచారణలో వెల్లడైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. పోక్సో చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Love Marriage: పెద్దలు ఒప్పుకోకపోవడంతో అన్నవరంలో ప్రేమ పెళ్లి.. కానీ దురదృష్టం ఏంటంటే...

బాలిక తండ్రి డ్యూటీకి వెళ్లగానే.. ఆమె తల్లికి కళ్లు కనబడవనే ధైర్యంతో నిందితుడు నేరుగా ఆ బాలిక ఇంటికి వెళ్లి ఆమెతో తన శారీరక అవసరాలు తీర్చుకునేవాడని విచారణలో తేలింది. ఇదిలా ఉండగా.. ఆ బాలిక గర్భంతో ఉండగా రెండు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా వైద్యం కోసం వెళ్లినట్లు తెలిసింది. ఆ హాస్పిటల్స్ కూడా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం యూట్యూబ్ వీడియోలను చూసే ఆ బాలిక ఎవరి సాయం లేకుండా బిడ్డకు జన్మనిచ్చిందంటే పోలీసులు పూర్తి స్థాయిలో నమ్మలేకపోతున్నారు. ఆ బాలిక అబద్ధం చెబుతుందేమోనన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

First published:

Tags: Crime news, Kerala, Minor rape, Youtube

ఉత్తమ కథలు