హోమ్ /వార్తలు /క్రైమ్ /

PUBG: ఆట ఆడొద్దని ఎంత చెప్పినా వినలేదు.. చివరికి..

PUBG: ఆట ఆడొద్దని ఎంత చెప్పినా వినలేదు.. చివరికి..

PUBG Effect: గేమ్ ఆడొద్దని ఫోన్ లాక్కున్నందుకు ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది.

పబ్‌జీ గేమ్ మరో ప్రాణాన్ని తీసింది. గేమ్ ఆడొద్దని ఫోన్ లాక్కున్నందుకు ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని జింద్‌లో ఓ యువకుడు(17) గత ఏడాది పదో తరగతి పూర్తి చేసి చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. అప్పటి నుంచి పబ్‌జీ గేమ్ ఆడుతూ దానిలోనే మునిగిపోయాడు. పొద్దస్తమానం దానిలోనే మునిగిపోవడంతో తల్లిదండ్రులు మొదట్లో కాస్త మందలించేవారు. తండ్రి పోలీస్. ఆయన కూడా గేమ్ ఆడొద్దని, చదువుపై దృష్టి సారించాలని హెచ్చరించాడు. అయినా, వినకపోవడంతో ఓ రోజు అతడి తల్లి ఫోన్ లాగేసుకుంది. దీని గురించి శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఈ గొడవతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అదే రోజు రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుజామున కుమారుడు ఇంకా నిద్ర లేవలేదని వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదనకు అడ్డులేకుండా పోయింది. ఘటనపై ఫిర్యాదు అందలేదని, అయితే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

First published:

Tags: Crime, Haryana, Health, PUBG

ఉత్తమ కథలు