• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • A 17 MEMBER GANG ARRESTED IN NALGONDA FOR TO CLAIM LIFE INSURANCE MONEY THEY KILLED POLICY HOLDERS SRD

Telangana : తస్మాత్ జాగ్రత్త.. నల్గొండలో నరహంతక ముఠా..పాలసీదారులే వారి టార్గెట్...

Telangana : తస్మాత్ జాగ్రత్త.. నల్గొండలో నరహంతక ముఠా..పాలసీదారులే వారి టార్గెట్...

ప్రతీకాత్మక చిత్రం

Telangana : పైసా మే పరమాత్మ. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏ దారుణానికైనా పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. బీమా సొమ్ముకు కక్కుర్తిపడిన ఓ కసాయి ముఠా బీమా పాలసీదారులను చంపేస్తున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది.

 • Share this:
  పైసా మే పరమాత్మ. ఈ రోజుల్లో డబ్బు కోసం ఏ దారుణానికైనా పాల్పడుతున్నారు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. బీమా సొమ్ముకు కక్కుర్తిపడిన ఓ కసాయి ముఠా బీమా పాలసీదారులను చంపేస్తున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ముందుగా నామినీదారులతో ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత పాలసీదారుల్ని హత్య చేస్తారు. ఆ తర్వాత వాహనంతో గుద్దించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తారు. తర్వాత ముందుగా నామినీదారుడితో కుదుర్చుకున్న ఒప్పందంతో భీమా సొమ్ము నొక్కేస్తారు. ఇలాంటి ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిరాతక ముఠాలో 17 మంది సభ్యులున్నారు. ఈ నరహంతక ముఠా ఇప్పటివరకు ఐదుగుర్ని పొట్టనపెట్టుకుంది. నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను ప్లాన్ ప్రకారం సేకరిస్తారు. ఆ తర్వాత ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పిస్తారు. ఒకటి రెండు ప్రీమియంలను వారే చెల్లించేస్తారు. ఆ తర్వాత వారి కుతంత్ర ప్లాన్ ను అమలు చేస్తారు.

  బీమా చేయించుకున్న వ్యక్తి నామినీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. అనంతరం బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఆపై వాహనంతో గుద్దించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తారు.ఆపై ఎఫ్ఐఆర్ కాపీ సేకరించి బీమాకు క్లెయిమ్ చేస్తారు. వచ్చిన మొత్తంలో కుటుంబసభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా మొత్తాన్ని అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్టు సమాచారం.

  దామచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు. వీరి ఆగడాలను విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక, ఈ దురాగతం వెనుక ఎవరైనా ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
  Published by:Sridhar Reddy
  First published: