Home /News /crime /

A 14 YEAR OLD CHILD A CLASS VIII STUDENT DIED OF DRUG OVERDOSE IN MUKTSAR DISTRICT PUNJAB SSR

14 Year Old Boy: అయ్యో పాపం.. 14 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయి.. కారణం ఆ అలవాటే..

సుఖ్వీందర్ సింగ్

సుఖ్వీందర్ సింగ్

ఎనిమిదో తరగతి చదువుతున్న టీనేజ్ బాలుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఎంతలా అంటే.. డ్రగ్స్ తీసుకోకపోతే ఉండలేని స్థితికి చేరుకుని.. మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. చివరకు ఆ మత్తు పదార్థాలకే బలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలోని తప ఖేడా గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ వయసు 14 సంవత్సరాలు. ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.

ఇంకా చదవండి ...
    పంజాబ్: బాలీవుడ్‌లో విడుదలై.. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమా గుర్తుందా.. పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వాడకం అక్కడి యువత జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో కళ్లకు కట్టినట్టు ఆ చిత్రంలో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా వచ్చి ఐదారేళ్లు అవుతున్నా ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఏమాత్రం మారలేదని చెప్పక తప్పదు. పోలీసులు మాదక ద్రవ్యాల వినియోగంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా పంజాబ్‌లో కొందరు యువత, టీనేజ్ బాలబాలికలు కూడా ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. కొందరైతే ఆ డ్రగ్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తూ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. పంజాబ్‌లో తాజాగా సరిగ్గా అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న టీనేజ్ బాలుడు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఎంతలా అంటే.. డ్రగ్స్ తీసుకోకపోతే ఉండలేని స్థితికి చేరుకుని.. మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. చివరకు ఆ మత్తు పదార్థాలకే బలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలోని తప ఖేడా గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ వయసు 14 సంవత్సరాలు. ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సుఖ్వీందర్ తండ్రి చనిపోయాడు. తాత, తల్లి, అక్క, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు.

    జూలై 7న జలాలాబాద్‌కు వెళ్లాలని తన స్నేహితులు కొందరితో కలిసి సుఖ్వీందర్ బయటకు వెళ్లాడని.. ఆ రోజు సాయంత్రం ఇంటికి భుజానికి గాయంతో వచ్చాడని.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. డ్రగ్స్ ఓవర్‌డోస్ కావడంతో చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారని సుఖ్వీందర్ తాతయ్య మహంత్ సింగ్ తెలిపారు. కొన్ని నెలలుగా సుఖ్వీందర్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని.. జూలై 7న కూడా స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని.. ఆ డ్రగ్స్ మోతాదుకు మించి తీసుకోవడంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు.

    ఇది కూడా చదవండి: Shocking: వామ్మో.. ఇలాంటి మానవ మృగాల మధ్య బతుకుతున్నామా.. ఈ 21 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే..

    సుఖ్వీందర్ సింగ్ తాతయ్య మహంత్ సింగ్ మాట్లాడుతూ.. గ్రామంలో రెండుమూడేళ్లుగా డ్రగ్స్ బహిరంగంగా అమ్ముతున్నారని.. పోలీసులు డ్రగ్స్ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. గ్రామంలోని చిన్నచిన్న పిల్లలు డ్రగ్స్‌ తీసుకుంటున్నారని.. ఊరిలోని పిల్లలు, యువత డ్రగ్స్ కారణంగా నాశనమై పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని చాలా గ్రామాల్లో పరిస్థితి ఇలానే ఉంది. సుఖ్వీందర్ సింగ్ లాంటి ఎంతోమంది టీనేజ్ పిల్లలు, యువతీయువకులు మత్తులో మునిగి తేలుతూ బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వం మరింత చొరవ చూపి.. మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేసి.. అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితిలో మార్పు రాదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Drugs, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు