హోమ్ /వార్తలు /క్రైమ్ /

Teenager: షాకింగ్ ఘటన... ఆన్‌లైన్ క్లాసులకని స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చి.. నెట్ బ్యాలెన్స్ వేయిస్తే 14 ఏళ్ల బాలుడు చేసే పని ఇదా..!

Teenager: షాకింగ్ ఘటన... ఆన్‌లైన్ క్లాసులకని స్మార్ట్‌ఫోన్‌ కొనిచ్చి.. నెట్ బ్యాలెన్స్ వేయిస్తే 14 ఏళ్ల బాలుడు చేసే పని ఇదా..!

ఆవేదనలో బాధిత కుటుంబం

ఆవేదనలో బాధిత కుటుంబం

మహిళల భద్రతకు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారిపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. పసి వాళ్లన్న కనికరం కూడా లేకుండా అమానుషానికి ఒడిగడుతున్నారు. కొందరు టీనేజర్లు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం.

నాగ్‌పూర్: మహిళల భద్రతకు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారిపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. పసి వాళ్లన్న కనికరం కూడా లేకుండా అమానుషానికి ఒడిగడుతున్నారు. కొందరు టీనేజర్లు కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. నాగ్‌పూర్‌లోని న్యూ కంప్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ప్రాంతంలో నివాసం ఉండే ఓ 14 ఏళ్ల బాలుడు పోర్న్ వీక్షణకు బానిసయ్యాడు.

గత ఆదివారం ఇంట్లో పెద్ద వాళ్లు ఎవరూr లేకపోవడం, తన చెల్లి మాత్రమే ఉండటతో బెడ్రూంలోకి వెళ్లి ఫోన్‌లో పోర్న్ చూశాడు. ఆ కామోద్రేకంలో ఆ బాలుడు పక్కింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారిని ఆడుకుందాం రమ్మని పిలవాలని తన ఆరేళ్ల వయసున్న చెల్లికి చెప్పాడు. అయితే.. ఆ చిన్నారిని పిలిస్తే అన్న ఇంత దారుణానికి ఒడిగడతాడని పసిగట్టలేకపోయిన ఆమె తన సోదరుడు చెప్పినట్టుగానే ఎదురింట్లో ఉండే నాలుగేళ్ల పాపను ఆడుకోవడానికి పిలిచింది. ఆ పాపతో కొంతసేపు ఆడుకున్న తర్వాత అతని చెల్లెలు టీవీ చూస్తూ ఉండిపోయింది. ఇదే అదనుగా.. ఆమె పక్కనే టీవీ చూస్తూ ఉన్న పాపను నిందితుడు చాక్లెట్ ఆశ చూపి బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

నాలుగేళ్ల చిన్నారి కావడంతో ఆ బాధను తట్టుకోలేకపోయిన ఆ పాప ఇంటికెళ్లి ఏం జరిగిందో చెప్పింది. దీంతో.. ఆ పాపను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె తల్లిదండ్రులు నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ టీనేజర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఈ కేసు విచారణలో కొన్ని కీలక విషయాలు తెలిశాయి. ఆ టీనేజర్‌కు కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండటంతో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చారని, ఆ సమయంలో పోర్న్ వీక్షణకు ఆ 14 ఏళ్ల బాలుడు అలవాటుపడినట్లు తెలిసింది. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం తప్పు కాదని, కానీ.. ఆ ఫోన్‌లో వాళ్లు ఏం చేస్తున్నారనే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తన ఆరేళ్ల వయసున్న చెల్లిని పావుగా వాడుకుని ఈ టీనేజర్ ఘోరానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: Missing Lady Teacher: స్కూల్‌లో సెక్స్ స్కాండల్.. ఆ స్కూల్‌లో పనిచేసే లేడీ టీచర్ పరిస్థితి చివరకు ఏమైందంటే...

నాగ్‌పూర్ పరిధిలో ఇటీవల ఇలాంటి మరో ఘటనే వెలుగుచూసింది. నాగ్‌పూర్ రూరర్‌లో ఉన్న కన్యాభోజ్ ప్రాంతంలో నవరాత్రి సమయంలో ఐదేళ్ల బాలిక ఒక్కతే ఇంట్లో ఉండగా పక్కింటి టీనేజర్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కూడా ఆ టీనేజర్ తన స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ చూశాకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ రెండు ఘటనలు టీనేజర్లకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చే తల్లిదండ్రులను హెచ్చరించే విధంగా ఉన్నాయి. నీలిచిత్రాల వ్యామోహంలో పడి చిన్నారుల జీవితాలను చిదిమేసేందుకు కూడా కొందరు టీనేజర్లు వెనుకాడటం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఘటన కళ్ల ముందు కదిలాడుతూనే ఉంది. మాదక ద్రవ్యాల మత్తులో కొందరు, మద్యం మత్తులో కొందరు, నీలిచిత్రాలకు అలవాటు పడి మరికొందరు చిన్నారులను చిదిమేస్తున్నారు.

First published:

Tags: Minor girl raped, Online classes, Porn Movies, Rape on minor

ఉత్తమ కథలు