Home /News /crime /

విశాఖలో పదేళ్ల బాలుడి ప్రాణం తీసిన గాలిపటం

విశాఖలో పదేళ్ల బాలుడి ప్రాణం తీసిన గాలిపటం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గాలిపటం ఎగరవేయాలనే సరదా ఓ బాలుడి ప్రాణం బలితీసుకుంది.. హ్యాపీ ఆడుకోవాల్సిన బాలుడి పాలిట యమపాశంలా మారింది..

    ఆటపాటలతో సరదాగా గడపాల్సిన ఓ బాలుడి ప్రాణాలు తీసింది గాలిపటం. అప్పటి వరకు హ్యాపీగా ఆడుకుంటున్న అతడి నిండు నూరేళ్ల జీవితాన్నియమపాశంలా బలితీసుకుంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ చిన్నారి ఊపిరి ఆపేసింది. గాలిపటం ప్రాణాలు తీసిన ఈ విషాద ఘటన విశాఖపట్నంలోని అక్కిరెడ్డి పాలెంలో చోటు చేసుకుంది..

    విశాఖ సిటీలో ఉన్న ప్రాధాన జంక్షన్లో అక్కిరెడ్డి పాలెం ఒకటి.. అక్కడ నివాసం ఉంటున్న మురళీ అనే వ్యక్తి డాక్ యార్డ్ క్యాంటీన్ లో రోజు వారీ కూలీగా పని చేస్తున్నాడు.. ఆయన భార్య భవ్య తేజ.. వారికి ఇద్దరు సంతానం.. పదేళ్ల కొడుకు అభిరామ్, కూతురు కీర్తి ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత ఎప్పటిలాగే సాయంత్రం డాబాపై ఆడుకునేందుకు వెళ్లారు అభిరామ్ కీర్తీలు.

    గాలిపటం ఎగరేయడమంటే మహా ఇష్టమైన అభిమారామ్ ప్రతి రోజులానే ఇంటి మేడపై గాలిపటం ఎగరేయాలి అనుకున్నాడు.. అలా గాల్లో లేచిన గాలిపటం.. సమీపంలోని 11 కేవీ విద్యుత్తు తీగలకు చిక్కుకుంది. అయితే ఆ గాలిపటాన్ని చిన్నారి వదిలేస్తే బాగుండేది.. కానీ తన గాలిపటాన్ని ఎలాగైనా తీసుకోవాలని ప్రయత్నించాడు.. దగ్గర్లో ఒక కర్ర కనిపించడంతో ఆ కర్ర సహకారంతో గాలి పటాన్ని విద్యుత్ వైర్ల నుంచి తప్పించాలి అనుకున్నాడు.. కానీ విద్యుత్ సరఫారా అవ్వడంతో ఒక్కసారిగా బాలుడికి షాక్ కొట్టింది. వెంటనే గిలగిల కొట్టుకుంటూ కిందకు పడిపోయాడు. ఏం చేయాలో తెలియని కీర్తి వెంటనే తల్లిదండ్రులను రమ్మంటూ అరించింది. అది గమనించిన తల్లిదండ్రులు డాబాపైకి వచ్చి బాలుడ్ని హుటాహుటిన షీలా నగర్ ఆస్పత్రికి తరలించారు.. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలారు.. గాలిపటం ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Kites, Visakhapatnam

    తదుపరి వార్తలు