72 ఏళ్ల కొడుకు అలా అన్నాడని తుపాకీతో కాల్చి చంపిన 92 ఏళ్ల తల్లి... అతని ప్రియురాలిని...

నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్తానని చెప్పిన కొడుకును కాల్చి చంపిన తల్లి... అతని ప్రియురాలికి తుపాకీ చూపించి, చంపుతానంటూ బెదిరింపులు..

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: June 1, 2019, 4:33 PM IST
72 ఏళ్ల కొడుకు అలా అన్నాడని తుపాకీతో కాల్చి చంపిన 92 ఏళ్ల తల్లి... అతని ప్రియురాలిని...
72 ఏళ్ల కొడుకును తుపాకీతో కాల్చి చంపిన 92 ఏళ్ల వృద్ధురాలు... అతని ప్రియురాలిని...
  • Share this:
92 ఏళ్ల పండు ముసలి వయసులో తన కొడుకును తుపాకీతో కాల్చి చంపిందో తల్లి. చిన్న కారణానికి గాయపడిన ఆమె మనసు... 72 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకును కడతేడ్చేలా చేసింది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన అమెరికాలో అరిజోనా రాష్ట్రంలో వెలుగుచూసింది. అరిజోనాలో నివాసం ఉంటున్న అన్నా మే బ్లెస్సింగ్ అనే 92 ఏళ్ల వృద్ధురాలు... తన కొడుకు థామస్‌తో కలిసి నివాసం ఉంటోంది. అయితే కొన్నాళ్లుగా బ్లెస్సింగ్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారడంతో తల్లిని చూసుకోవడం థామస్‌కు కష్టమైపోయింది. దాంతో ఆమెకు నర్సింగ్ హోమ్‌లో చేర్పిస్తానని చెప్పాడు థామస్. నర్సింగ్ హోమ్‌కు వెళ్లడం ఇష్టం లేని బ్లెస్సింగ్... తన కొడుకుతో ఆ విషయం చెప్పింది. అయితే కొడుకు నర్సింగ్ హోమ్‌కి తీసుకెళ్లడం ఖాయమని చెప్పడంతో ఆగ్రహానికి గురైన బ్లెస్సింగ్... తుపాకీతో అతన్ని కాల్చి చంపింది. ఆ సమయంలో అక్కడే ఉన్న అతని ప్రియురాలిని కూడా చంపేస్తానని బెదిరించింది. దాంతో ఆమె అక్కడి నుంచి పారిపోయి, పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... బ్లెస్సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా... తానే తన కొడుకును చంపినట్టు ఒప్పుకుంది.

గత ఏడాది మార్చిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇప్పుడు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు అరిజోనా పోలీసులు. కొడుకును చంపినందుకు తాను ఎలాంటి ప్రశ్చాతాపం పడడం లేదని పోలీసుల విచారణలో బ్లెస్సింగ్ చెప్పడం విశేషం.First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు