షాకింగ్.. దేశంలో ప్రతి రోజూ 90 మంది మహిళలపై రేప్..

ప్రతీకాత్మక చిత్రం

ఒక్క 2017లోనే 32,500 రేప్ కేసులు నమోదయ్యాయి. వివరంగా చెప్పాలంటే.. రోజుకు 90 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు.

  • Share this:
    మొన్న నిర్భయ.. నిన్న దిశ.. నేడు ఉన్నావ్ బాధితురాలు.. ఇలా దేశంలో ఎక్కడో చోట మహిళలపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చట్టాలు వస్తున్నా కామాంధులు, మృగాలు విజృంభిస్తూనే ఉన్నారు. ఆడది కనిపిస్తే చాలు.. ఆరగించేద్దాం అన్న రీతిలో క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అత్యాచారం, హత్య, దహనం.. చేస్తూ ఆడబిడ్డను బలి చేస్తున్నారు. ఎంతలా అంటే.. ఒక్క 2017లోనే 32,500 రేప్ కేసులు నమోదయ్యాయి. వివరంగా చెప్పాలంటే.. రోజుకు 90 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే. కేసులు నమోదు చేయకుండా తమలో తామే కుమిలిపోయే మహిళలు ఎందరో ఉన్నారు. ఆ ఏడాది భారత కోర్టులు కేవలం 18,300 కేసుల్లో మాత్రమే తీర్పు వెలువరించాయి. మొత్తంగా 2017 చివరి నాటికి 1,27,800 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2010లో 22,172 రేప్ కేసులు నమోదయ్యాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: