అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్...

90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు.

news18-telugu
Updated: November 28, 2019, 4:02 PM IST
అమెరికాలో 90 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. డెట్రాయిట్‌ లో ని ఫార్మింగ్‌ టన్‌ నకిలీ యూవర్శిటీ ని మూసివేసిన హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు అందులో చేరిన 250 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారిలో 90 మంది భారతీయ విద్యార్థులున్నారని తేలింది. స్డూడెంట్స్‌ అరెస్ట్‌ తో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్శిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా డెమోక్రటిక్‌ నేతలు అభివర్ణిస్తున్నారు. గత మార్చి నెలలో యూనివర్సిటీలో 161 మందిని అరెస్టు చేశారు. ఆ వర్సిటీని మూసివేసే సమయానికి అందులో 600 విద్యార్థులు చదువుతున్నట్లు తెలిసింది. దాంట్లో ఎక్కవశాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు