Home /News /crime /

వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ.. ఇద్దరు యువకులు ఓ బాలికను నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లారు.. చివరకు..

వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ.. ఇద్దరు యువకులు ఓ బాలికను నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లారు.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nine Years Minor Girl: చౌటకుర్ మండలం శివ్వంపేట వద్ద తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలికను సంగారెడ్డి నుంచి బైక్ పై ఇద్దరు యువకులు తీసుకు వస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులు ఆ యువకుడిని చితకబాదారు. తదనంతరం ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  (K. Veeranna, News18, Medak)

  మెదక్ జిల్లా చౌటకుర్ మండలం శివ్వంపేట వద్ద తొమ్మిది సంవత్సరాల మైనర్ బాలికను సంగారెడ్డి నుంచి బైక్ పై ఇద్దరు యువకులు తీసుకు వస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులు ఆ యువకుడిని చితకబాదారు. తదనంతరం ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల నుంచి బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 9 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన బాలికను ఇద్దరు యువకులు శనివారం  కిడ్నాప్ చేసి జోగిపేట వైపు బైక్ పై నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్తుండగా అనుమానం వచ్చిన గ్రామస్తులు వాళ్లిద్దరిని అడ్డుకున్నారు.

  Hyderabad News: మీకు రూ.30 వేలు కావాలా.. అయితే ఈ పని చేసిపెట్టండి..  వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి ఇద్దరు దుండగులు తీసుకువచ్చినట్లు బాలిక తెలపటంతో స్ధానికులు ఇద్దరిని పట్టుకుని.. వారిపై దాడి చేసి సంగారెడ్డి టౌన్ పోలీసులకు అప్పగించారు. బాలికను రక్షించి 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరు కంది, మరొకరు సదాశివపేట కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా..ఇటీవల హైద‌రాబాద్‌లోని సైదాబాద్‌, సింగ‌రేణి కాల‌నీలో చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య, అత్యాచారం చేసి ఘటన తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  ఈ ఘటన తర్వాత హైదరాబాద్ లోనే మరో ఘటన చోటుచేసుకుంది. మంగ‌ళ్‌హాట్ ప‌రిధిలో తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం జ‌రిగింది. స్థానికంగా ఉండే ఓ యువ‌కుడు అత్యాచారం చేసిన‌ట్లు బాలిక బంధువులు ఆరోపించారు. సుమిత్ అనే యువ‌కుడు ఖాళీగా ఉన్న దుకాణం షేటర్‎లోకి చిన్నారిని లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. చిన్నారి కేకలు వేయడంతో.. అక్క‌డికి వెళ్లిన స్థానికులు.. సుమిత్‌ను ప‌ట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. స్థానికుల అలర్ట్‎తో చిన్నారి సేఫ్‎గా బయటపడింది.

  అతడికి 19 ఏళ్లు.. ముసలవ్వను లైంగికంగా వేధించడంతో ప్రతిఘటించింది.. కోపంతో ఆమెను చంపి.. చివరకు ఆ మృతదేహంపై..

  తప్పించుకున్న నిందితుడిని అత్తాపూర్‎లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హ‌బీబ్‌న‌గ‌ర్ ప‌రిధిలో న‌మో దైన ఓ చోరీ కేసులో సుమిత్ నిందితుడిగా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో అత్యాచారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వారి తల్లిదండ్రుల పిల్లలను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉంటే మంచిది. కఠినమైన చట్టాలు కీచక కాండలను ఆపడం లేదని సర్వేల్లో స్పష్టం అవుతోంది.

  మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రమైన శిక్షలతో కూడిన చట్టాలను తీసుకు వచ్చినా తెగించిన మగాళ్లు వాటికి భయపడటం లేదని పోలీసుల గణాంకాలు కూడా చెబుతున్నాయి. ప్రత్యేకించి దేశ రాజధానిలో జరుగుతున్న అకృత్యాల వివరాలను బట్టి చూస్తే ఈ విషయంపై స్పష్టత వస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతండటంతో హైదరాబాద్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Medak, Sangareddy

  తదుపరి వార్తలు