కేరళలో దారుణం.. ఏడాదిగా బాలుడిపై మహిళ లైంగికదాడి

మూడు పదులు దాటిన వయస్సు ఆమెది.10 ఏళ్లు కూడా నిండని పిల్లాడిపై కన్నేసింది. కామ వాంఛ తీర్చుకునేందుకు.. 12 నెలలుగా ఆ బాలుడిపై లైంగిక దాడి చేస్తోంది. కేరళలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: February 11, 2019, 5:14 PM IST
కేరళలో దారుణం.. ఏడాదిగా బాలుడిపై మహిళ లైంగికదాడి
నమూనా చిత్రం
news18-telugu
Updated: February 11, 2019, 5:14 PM IST
కేరళలోని తిరువనంతపురంలో దారుణం జరిగింది. 36 ఏళ్ల ఓ మహిళ.. 9 ఏళ్ల పిల్లాడిపై అఘాయిత్యానికి తెగబడింది. ఏడాది కాలంగా అతనిపై లైంగిక దాడి చేస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనం రేపుతోంది.  గతవారం స్థానికంగా ఉండే హాస్పిటల్‌కు వెళ్లిన బాలుడు.. జరిగిన విషయాన్నంతా వైద్యుడికి వివరించాడు. దీంతో అతని స్టే‌ట్మెంట్‌ను రికార్డు చేసుకున్న వైద్యుడు.. చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించాడు. దీంతో విషయం బహిర్గతమైంది.

బాలుడు చెప్పిన వివరాల ఆధారంగా రిపోర్టు చేసిన డాక్టర్.. చైల్డ్‌లైన్ అధికారులకు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ మహిళపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఏడాదికిపైగా ఆమె తనపై లైంగికదాడికి పాల్పడినట్టు..  బాలుడు పోలీసులకు తెలిపాడు. చైల్డ్‌లైన్ కూడా ఆ బాలుడు లైంగిక దాడిని ఎదుర్కొన్నట్టు నిర్ధారించింది. ఆ మహిళ చేసిన లైంగికదాడి.. బాలుడి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపిందని తెలిపింది.

బాలుడు చైల్డ్‌లైన్‌కు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా.. మహిళపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. అయితే, ఆరోపణ ఎదుర్కొంటున్న మహిళకు, బాలుడి ఫ్యామిలీకి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయని, అందుకే ఆమె ఈ దారుణానికి ఒడి గట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...