9 YEAR OLD BOY BOOKED FOR SEXUALLY ASSAULTING 4 YEAR OLD NEIGHBOUR IN ULHASNAGAR TOWN THANE MAHARASHTRA MKS
Shocking: 4ఏళ్ల చిన్నారిపై 9ఏళ్ల బాలుడు లైంగికదాడి.. వాడిపై రేప్ కేసు నమోదు
ప్రతీకాత్మక చిత్రం
పట్టుమని పదేళ్లయినా లేని ఆ పిల్లోడి మనసు ఎలా కలుషితం అయిందోగానీ, పక్కింట్లో ఉండే చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. తొమ్మిదేళ్ల బాలుడు.. నాలుగేళ్ల పాపపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది..
మారుతున్న కాలంలో చిన్న పిల్లలు రకరకాల ప్రభావాలకు గురవుతూ, ఊహాతీతమైన చర్యలకు ఒడిగడుతోన్న ఘటనల సంఖ్య ఇటీవల పెరుగుతూ వస్తోంది. బాలికలపై లైంగిక అకృత్యాలకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే బాలికపై లైంగికదాడి చేసింది 9ఏళ్ల బాలుడు కావడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఈ కేసులో పోలీసులు బాలుడిపై రేప్ కేసు నమోదు చేయడం గమనార్హం. వివరాలివి..
పట్టుమని పదేళ్లయినా లేని ఆ పిల్లోడి మనసు ఎలా కలుషితం అయిందోగానీ, పక్కింట్లో ఉండే చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. తొమ్మిదేళ్ల బాలుడు.. నాలుగేళ్ల పాపపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో సంచలనం సృష్టించింది.
థానె జిల్లాలోని ఉల్హాస్నగర్ టౌన్‌లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇరుగుపొరుగు ఫ్లాట్ల పిల్లలు అందరూ కలిసి ప్రతిరోజూ ఆటలాడుకునేవారు. ఆ కాంప్లెక్స్ లోనే తొమ్మిళ్ల అబ్బాయి, నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. రోజూలాగే ఈనెల 3న కూడా పాప ఆడుకుంటానంటూ మెట్లు దిగి కిందికి వెళ్లింది. తోటి పిల్లలతో కలిసి ఆటాడుకుంటుండగా, 9 ఏళ్ల బాలుడు ఆమెను ఇంకో ఆట ఆడుదామంటూ బిల్డింగ్ వెనుక ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు..
బాలిక దుస్తులు పక్కకు తొలగించిన బాలుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణకాండ కొద్ది రోజులపాటు జరగ్గా, మర్మాయవాల్లో నొప్పిగా ఉందని ఆ చిన్నారి తన తల్లికి చెప్పడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో బాధిత కుటుంబం శుక్రవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడైన బాలుడిపై పోస్కో చట్టం, 376 (రేప్) సెక్షన్ కింద కేసు నమోదుచేసినప్పటికీ అతణ్ని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. కాగా, ఎవరో మాటలతో ఉపదేశించడం వల్లే బాలుడు.. చిన్నారిపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లవాడి మనసును కలుషితం చేసిన ఆ వ్యక్తిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.