Home /News /crime /

9 PEOPLE CHARRED TO DEATH AS FIRE BREAKS OUT AFTER TANKER TRUCK COLLISION IN MAHARASHTRA S CHANDRAPUR PAH

Fire Breaks Out: ఘోరం.. కళ్ల ముందే తొమ్మిది మంది సజీవ దహనం.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maharashtra: చంద్రపూర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగిఉన్న ట్రక్ ను, ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

మహరాష్ట్రలోని (Maharashtra) చంద్రపూర్ లో (chandrapur) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంద్రపూర్ సమీపంలో అజయ్ పూర్ దగ్గర ఈ ఘోరం జరిగింది. ఒక ట్రక్ లో కలప దుంగలను తరలించడానికి సిద్ధంగా ఉంచారు. ఈక్రమంలో ఒక ట్యాంకర్ వేగంగా వచ్చింది. అది వెళ్లి ట్రక్ ను ఢీకొట్టింది. దీంతో అక్కడి డీజిల్ పైపు పేలిపోయింది. ఆ ట్రక్ లో కార్మికులు ఉన్నారు. వెంటనే మంటలు అంటుకున్నాయి.

డీజిల్ పైపు పగిలిపోయింది. కలపకు మంటలు అంటుకున్నాయి. దాదాపు.. 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. (Road accident)  వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మరికొందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గురువారం అర్దరాత్రి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాధితుల బంధువుల రోదనతలు, బాధతో వారు పెడుతున్న ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగటానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా గతంలో  కర్ణాటకలో రోడ్డు ప్రమాదం జరిగింది.

బెంగుళూరులో విషాదకర ఘటన. బెంగుళూరు-కడపరహదారిపై చింతామణి సమీపంలోని నందిగానిపల్లె గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. దీంతో జీపులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. పదిహేను రోజుల క్రితం కూండా బెంగళూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. హైవేపై ప్రయాణిస్తున్న కాస్లీరు ఓ కరెంట్ పోల్‌కు ఢీ కొట్టడడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్‌లో చనిపోయారు. ఈ సంఘటన అర్థరాత్రి రెండు గంటల తర్వాత జరిగినట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటక బెంగళూరులోని కోరమంగళ లోని ఓ కన్వేషన్ సెంటర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రహదారిలోని ఓ కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులో మంటలు చేలరేగాయి.

దీంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో తమిళనాడులోని హోసూరు ఎమ్మెల్యే ప్రకాశ్ కొడుకుతోపాటు కోడలు కూడా మృతుల్లో ఉన్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Maharashtra, Road accident

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు