Home /News /crime /

9 KILLED IN HEAD ON COLLISION BETWEEN BUS AND AUTO IN WEST BENGALS BIRBHUM PAH

Shocking: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం.. ఎక్కడంటే..

బస్సును ఢీకొన్న ఆటో..

బస్సును ఢీకొన్న ఆటో..

Road accident: మహిళలు పొలం పనులు చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో.. జాతీయ రహాదారిపై నుంచి ఆటోలో వస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • West Bengal, India
వారిది రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం. ఈ క్రమంలో.. మహిళలు పొలం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వెస్ట్ బెంగాల్ లో (West bengal) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో జాతీయ రహదారి-60పై మంగళవారం మధ్యాహ్నం ఆటోరిక్షా , రాష్ట్ర రవాణా బస్సు ఢీకొనడంతో ఎనిమిది మంది మహిళా రైతు కూలీలు సహా తొమ్మిది మంది మరణించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

రాంపూర్‌హట్‌ సమీపంలోని మల్లార్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కిక్కిరిసిన ఆటోరిక్షా దక్షిణ బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (SBSTC) బస్సును ఎదురుగా (Road accident) ఢీకొట్టింది. ఎనిమిది మంది మహిళలు త్రీవీలర్‌లో ప్రయాణిస్తున్నారని, తొమ్మిదవ బాధితుడు దాని డ్రైవర్ అని బీర్భూమ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నాగేంద్ర నాథ్ త్రిపాఠి తెలిపారు.మహిళలు వరి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారని తెలిపారు. వారి మృతదేహాలను ఆరంబాగ్ ఆసుపత్రికి తరలించామని, అక్కడ పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. బస్సు ఆరంబాగ్ నుంచి దుర్గాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరగ్గానే.. అక్కడి వాతావరణమంతా.. రక్త సిక్తంగా మారిపోయింది. గాయపడిన వారిని పోలీసులు వెంటనే ప్రత్యేక అంబూలెన్స్ లో ఆస్పత్రులకు తరలించారు.

ఇదిలా ఉండగా గతంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోను రోడ్డుప్రమాదం జరిగింది.  రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి.  ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు (Summer Holidays) కావడం.. అందులోనే వారంతం అవ్వడంతో.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం (Srisailam) పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని భక్తులు ఆశించారు. అనుకున్నట్టే సంతోషంగా శ్రీశైలానికి చేరుకున్నారు.. అనుకున్నట్టు స్వామివారిని దర్శించుకుని.. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.

ఆ దేవుడి కృప తమకు దక్కిందని ఆనందంగా కనిపించారు.. ఆ ఆనందంతో తిరిగి ఇంటికి పయనం అయ్యారు. శ్రీశైలంలో స్వామి దర్శనం మాటల గురించి అంతా ముచ్చట్లు పెట్టుకొని.. హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. అంతా తమ గ్రామ సరిహద్దుకు కూడా చేరుకున్నారు. కాసేపట్లో ఎవరి ఇంటికి వారు వెళ్తామని చెప్పుకుంటున్నారు. ప్రయాణం చేసి అలసిపోయామని. కాసేపటికి ఇంటికి చేరాగానే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుటన్నారు. కానీ ఊహించని కుదుపు వారి జీవితాల్లో విషాదం నింపింది.

అప్పటికే అర్థరాత్రి అయ్యింది సమయం.. అలా కబుర్లు చెప్పుకుంటూ కొంతమంది నిద్రలోకి జారుకోగా.. కొందరు కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని మాట్లాడుకుంటున్నారు. అప్పటికే చుట్టు చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆ చీకటిలో ఊహించని ప్రమాదం చోటు చేసకుంది. ఆ వ్యాన్ లో నిద్రలో ఉన్నవారికి అసలు ఏం జరిగిందో తెలియకుండానే ప్రాణాలు పోయాయి.. మెలుకువగా ఉన్నవారకి ఏం జరిగిందో అర్థం కాకా హాహాకారులు పెట్టారు. ఆ షాక్ నుంచి తేరుకుని తమను రక్షించండి అంటూ ఆర్తనాదాలు పెట్టారు. కరెంటు కార్యాలాయం దగ్గర అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణమైన ప్రమాదం పల్నాడు జిల్లా (Palnadu District) లోని చోటు చేసుకుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Road accident, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు