అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం... 11 మంది దుర్మరణం

11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ప్రమాద తీవ్రత భారీగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

news18-telugu
Updated: September 23, 2019, 4:48 PM IST
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం... 11 మంది దుర్మరణం
అసోంలో రోడ్డు ప్రమాదం
news18-telugu
Updated: September 23, 2019, 4:48 PM IST
అసోంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిబ్‌సాగర్‌ జిల్లాలో ప్రైవేట్ బస్సు టెంపోను ఢీకొని బోల్తాపడింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందరు. మరికొందరు తీవ్రగాయాల పాలయ్యారు. సోమవారం ఉదయం గంటల 8.35 నిమిషాలకు డిమోవ్‌లోని నేషనల్ హైవే -37పై ఓ ప్రవైటు బస్సు.. టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

11 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.ప్రమాద తీవ్రత భారీగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిని డిబ్రుగర్‌లోని అసో మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...