మానవ సంబంధాల ఉనికినే ప్రశ్నార్థకంగా మారిపోయిందనే చర్చకు ఆస్కారమిస్తూ అసాధారణ ఘటనలెన్నో ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. కోడి కూరలో విషం కలిపి తండ్రిని హతమార్చిన మైనర్ బాలిక (minor girl) ఉదంతం, పబ్లిక్ పార్కులో టాలీవుడ్ హీరోయిన్ (tollywood actress) పై అత్యాచారయత్నం తర్వాత సిటీలోనే జరిగిన మరో ఘోరం అందరినీ కలచివేస్తున్నది. వయసు 80 ఏళ్లు దాటినా, తీరని కామవాంఛతో అకృత్యానికి పాల్పడిన వృద్ధుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తోన్న మహిళ మనవరాలే బాధిత బాలిక కావడం గమనార్హం. నాటకీయ పరిణామాల మధ్య బయటపడిన ఈ ఉదంతంలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతనిపై పోక్సో తదితర చట్టాల కింద కేసులు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి ఛత్రినాక ఏసీపీ మహ్మద్ మాజిద్ మీడియాకు చెప్పిన వివరాలివి..
తాను లైంగిక బంధం ఏర్పర్చుకున్న మహిళ మనవరాలిపై అత్యాచారానికి తెగబడ్డాడ్డ వృద్ధుడి కామకేళి నగరంలో సంచలనం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఓల్డ సిటీ పరిధిలోని పంజెషా ప్రాంతానికి చెందిన హబీబుద్దీన్ అలియాస్ బషీర్ (80) అనే వ్యక్తి వయసు మీదపడ్డా, వివిధ కారణాలతో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎవరైనా అడిగితే తమది సహజీవన సంబంధమని బుకాయించేవాడు. పెద్ద వయసున్న ఆ మహిళతో పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా ఆమె మనవరాలిపైనే కన్నేశాడీ కామాంధుడు..
అమ్మమ్మతో అక్రమ సంబంధం కొనసాగించింది చాలక ఆ వృద్ధుడు.. మనవరాలిపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహిళతో పరిచయాన్ని ఆసరగా చేసుకుని గౌలిపురాకు చెందిన ఆమె మనవరాలి(11)పై సుమారు నెల రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గురించి ఆలస్యంగా తెలుసుకున్న బాలిక అమ్మమ్మ బషీర్‌ను నిలదీసింది. కానీ తనకేమీ తెలియందటూ బుకాయించాడా కీచకుడు. దీంతో అమ్మమ్మ ఆ బాలికను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లింది..
80 ఏళ్ల వృద్దుడు.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అమ్మమ్మ అయిన మహిళ ఉస్మానియా డాక్టర్లకు చెప్పగా, వారి సలహా మేరకు ఫిర్యాదు చేసేందుకుగానూ బాధితులు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తెలంగాణలో జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలవుతోన్న దరిమిలా వెంటనే కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, బాలిక ఉండే ప్రాంతం ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. సున్నితమైన కేసు కావడంతో ఏసీపీ మహ్మద్ మాజిద్ స్వయంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad police, Minor girl, Minor girl raped