షాకింగ్.. దుండగుల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి

వికాస్ దుబే అనే గ్యాంగ్ స్టర్, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: July 3, 2020, 6:45 AM IST
షాకింగ్.. దుండగుల కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఏకంగా పోలీసులపైనే కాల్పులకు దిగారు పలువురు దుండగులు. ఈ ఘటనలో ఏకంగా 8 మంది పోలీసులు చనిపోయారు. ఘటనలో గాయపడిన మరికొందరు పోలీసుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. వికాస్ దుబే అనే గ్యాంగ్ స్టర్, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఇంటి పైకప్పు నుంచి పోలీసులపై దుండగులు కాల్పులు జరిపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఉత్తరప్రదేశ్ డీజీపీ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. దుండగుల ముఠాలో 8 మంది వరకు ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
First published: July 3, 2020, 6:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading