ఏపీలో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు 8మంది మృతి

బస్సు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

news18-telugu
Updated: October 15, 2019, 2:12 PM IST
ఏపీలో ఘోర ప్రమాదం... లోయలో పడ్డ బస్సు 8మంది మృతి
లోయలో పడ్డ పర్యాటక బస్సు
  • Share this:
ఏపీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో 20కు పైగా మంది ప్రయాణించినట్లు సమాచారం. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే పై రోడ్డు నుంచి వెళ్తుండగా కింద రోడ్డుపై అదుపు తప్పి నడినట్లు చెబుతున్నారు.

లోయలో పడిన బస్సు 8మంది మృతి


భ‌ద్రాచ‌లం నుంచి రాజ‌మండ్రికి బ‌స్సు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సంఘ‌ట‌నా స్థలానికి హుటాహుటిన మారేడుమిల్లి పోలీసులు బయల్దేరారు. అడ‌విలో పాములేరు వ‌ద్ద బ‌స్సు లోయ‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. మారేడుమిల్లి స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ శివ‌రామ‌కృష్ణ, పోలీసు బృందం స‌హాయ కార్య‌క్ర‌మాలు చేపట్టారు. మృతుల‌కు సంబంధించి క‌చ్చిత‌మైన స‌మాచారం ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన స్థలంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు.

First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>