అంబులెన్స్ ఎక్కి ప్రాణాలు కోల్పోయారు.. కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..

Kerala Road Accident: కేరళలోని పాలక్కాడ్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం చెందారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 10, 2019, 12:33 PM IST
అంబులెన్స్ ఎక్కి ప్రాణాలు కోల్పోయారు.. కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 10, 2019, 12:33 PM IST
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలక్కాడ్ దగ్గర అంబులెన్స్, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ కూడా మృతి చెందాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. తొలుత కొందరు కారులో నెల్లియంపట్టికి విహారయాత్రకు బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న అంబులెన్స్ హుటాహుటిన అక్కడికి చేరుకొని వారిని ఎక్కించుకుంది. దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తుండగా లారీతో ఢీకొట్టింది.

దీంతో అందులో ఉన్నవారు సహా డ్రైవర్ దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారంతా పట్టాంభి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.

First published: June 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...