71 ఏళ్ల భార్య.. 78 ఏళ్ల భర్త.. ఇంత లేటు వయసులోనూ ఈ వృద్ధుడు చేసిన నిర్వాకానికి అతడి ప్రాణమే పోయింది..!

ప్రతీకాత్మక చిత్రం

అతడికి 78 ఏళ్ల వయసు. ఆమెకు 71 ఏళ్ల వయసు. ఇద్దరూ భార్యాభర్తలే. మనవళ్లతోనూ, మనవరాళ్లతోనూ హ్యాపీగా కాలం గడపాల్సిన సమయంలో ఆ వృద్ధుడు ఓ వింత నిర్వాకానికి పాల్పడ్డాడు. చివరకు ప్రాణాలే కోల్పోయాడు. అసలేం జరిగిందంటే..

 • Share this:
  ఓ వృద్ధ జంట. ఇద్దరికీ 70 ఏళ్ల పైనే వయసు ఉంటుంది. గత కాలపు స్మృతులను తలచుకుంటూ మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ హ్యాపీగా కాలం గడపాల్సిన వారి మధ్యలో అనుమానం ఓ పెను చిచ్చును రేపింది. ఆ వయసులో కూడా ఓ వ్యక్తితో అక్రమ సంబంధం నడుపుతోందన్న అనుమానం ఆ భర్తలో కలిగింది. అంతే మాటిమాటికీ సూటి పోటి మాటలతో ఆమెను హింసింససాగాడు. బంధువులు, స్నేహితులు నచ్చజెప్పినా, తీరుమార్చుకోమని సూచించినా అతడు మారలేదు. ఓ రోజు భార్య గుడికి వెళ్లింది. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కలవడానికే వెళ్లిందని ఆ వృద్ధుడికి అనుమానం కలిగింది. అంతే ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను నిలదీశాడు. చివరకు ప్రాణాలను కోల్పోయాడు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ పట్టణంలో 78ఏళ్ల వయసున్న అమ్రితల్ పటేల్ అనే వ్యక్తి తన 71 ఏళ్ల భార్య లక్ష్మితో కలిసి నివసిస్తున్నాడు. ఈ వృద్ధ జంటకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయి విదేశాల్లో సెటిల్ అయ్యారు. రిటైరయిన తర్వాత అమ్రితల్ తన భార్య లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. అయితే కొంత కాలంగా ఓ వ్యక్తితో లక్ష్మికి వివాహేతర సంబంధం ఉందంటూ అమ్రితల్ అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ వయసులో ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడతారా? అంటూ స్నేహితులు, బంధువులు నచ్చజెప్పినా అమ్రితల్ పట్టించుకోలేదు. అదే పనిగా ఆమెతో గొడవకు దిగేవాడు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్ హాస్టల్లో ఘోరం.. నాన్నా.. నన్ను క్షమించు.. అన్నా.. నేను తప్పు చేయలేదురా అంటూ.. మెసేజ్ పెట్టి మరీ..

  మార్చి 29వ తారీఖున లక్ష్మి గుడికి ఒంటరిగా వెళ్లింది. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కలిసేందుకే ఆమె బయటకు వెళ్లి ఉంటుందని అమ్రితల్ బావించాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. రోజంతా ఆమెతో గొడవ పడుతూనే ఉన్నాడు. దీంతో సహనం నశించిపోయిన లక్ష్మి, పక్కనే ఉన్న కర్రతో అతడి తలపై బాదింది. అంతే, అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: ఏడాది క్రితం పెళ్లయిన కూతురిని ఇంటికి పిలిచి.. అందరం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిన తండ్రి.. చివరకు..
  Published by:Hasaan Kandula
  First published: