ఇదో విచిత్రమైన కేసు... 78 ఏళ్ల బామ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష...

ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా? ఓ కేసులో తన తరఫున వాదించిన న్యాయవాది కేసు ఓడిపోవడంతో అతడిని చంపేందుకు ప్రయత్నించింది.

news18-telugu
Updated: October 29, 2019, 2:22 PM IST
ఇదో విచిత్రమైన కేసు... 78 ఏళ్ల బామ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష...
నిందితురాలు 78 ఏళ్ల పాట్రికా
  • Share this:
ఇదో విచిత్రమైన కేసు. 78 ఏళ్ల బామ్మకు అమెరికాలోని ఓ కోర్టు 22 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా? ఓ కేసులో తన తరఫున వాదించిన న్యాయవాది కేసు ఓడిపోవడంతో అతడిని చంపేందుకు ప్రయత్నించింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపిన అమెరికాలోని లూసియానా కోర్టు.. ఆమెకు 22 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఓ బ్యాంక్ లోను చెల్లింపు విషయంలో ఆమెపై బ్యాంక్ కేసు వేసింది. అయితే, ఆమె తరఫున వాదించిన న్యాయవాది కేసును సరిగా వాదించకపోవడం వల్లే తాను కోర్టులో ఓడిపోయానని ఆమె భావించింది. 2016లో ఓ రోజు అతడి ఇంటి తలుపు తట్టింది. డోర్ తీసిన ఆ న్యాయవాది ఎదురుగా చేతిలో మెషిన్ గన్‌తో 75 ఏళ్ల (అప్పటి వయసు) బామ్మ కనిపించింది. దీంతో అతడు షాక్‌కి గురయ్యాడు. వెంటనే ఆమె మీద పడి.. ఆ గన్‌ను లాక్కున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి చూసే సరికి ఆమె నేల మీద పడి ఉంది. న్యాయవాది కూడా ఆ గదిలోనే ఉన్నాడు. మెషిన్ గన్ కూడా కనిపించింది. న్యాయవాది ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారించిన కోర్టు.. బామ్మకు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 29, 2019, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading