Home /News /crime /

75 YEARS OLD MAN BEATS COVID BUT ROAD ACCIDENT KILLS HIM IN MEDAK DISTRICT SSR

Bike Accident: 75 ఏళ్ల వయసులో కరోనాను జయించాడు.. నెగిటివ్ వచ్చిన రెండు రోజులకు కూరగాయలకు వెళుతుండగా..

రోడ్డు ప్రమాద దృశ్యం

రోడ్డు ప్రమాద దృశ్యం

కరోనాను జయించిన వారిలో మెదక్ జిల్లాకు చెందిన నన్నేమియా ఒకరు. ఆయన వయసు 75 సంవత్సరాలు. భార్యతో కలిసి పోతరాజుపల్లిలోని గీతారెడ్డికాలనీలో నివాసముంటున్నాడు. ఏప్రిల్ 27న నన్నేమియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

    మెదక్: కరోనా మహమ్మారి రోజుకు కొన్ని వేల మంది ప్రాణాలను తీస్తోంది. అయితే.. కరోనాను ధైర్యంతో ఎదుర్కొని జయిస్తున్న వారూ ఉన్నారు. కరోనా బారిన పడిన యువత మాత్రమే కాదు వృద్ధులు కూడా కరోనాను జయించి ధైర్యంతో ప్రాణాలను నిలుపుకుంటున్నారు. అలా కరోనాను జయించిన వారిలో మెదక్ జిల్లాకు చెందిన నన్నేమియా ఒకరు. ఆయన వయసు 75 సంవత్సరాలు. భార్యతో కలిసి పోతరాజుపల్లిలోని గీతారెడ్డికాలనీలో నివాసముంటున్నాడు. ఏప్రిల్ 27న నన్నేమియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. వైద్యుల సలహాతో హోం ఐసోలేషన్ పాటించి చికిత్స తీసుకున్నాడు. ఆయన భార్యకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత 15 రోజులుగా భార్యాభర్తలిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యం పొందారు. ఇద్దరూ వైరస్ ప్రభావం తగ్గడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ఇంటి దగ్గరే ఉండి కరోనాను జయించిన ఈ దంపతులిద్దరూ ఊరట చెందారు. అయితే.. కరోనా నుంచి కోలుకుని ప్రాణాలు దక్కించుకున్న నన్నేమియాను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలితీసుకుంది.

    కరోనా నుంచి కోలుకుని.. నెగిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఇంట్లోకి కూరగాయలు తెచ్చేందుకు నన్నేమియా యాక్టివాపై తూప్రాన్ పట్టణానికి వెళుతుండగా మార్గ మధ్యలో నర్సాపూర్ చౌరస్తాకు సమీపంలో డీసీఎం వాహనం నన్నేమియా యాక్టివాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఈ వృద్ధుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

    ఇది కూడా చదవండి: Black Fungus: బ్లాక్ ఫంగస్ ఎంతపని చేసింది.. హైదరాబాద్ సన్‌షైన్‌లో చేర్చారు.. చివరికి ఏమైందంటే..

    కరోనా నుంచి కోలుకున్న తన భర్తకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని భార్య కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. నన్నేమియా భార్య ఫిర్యాదుతో తూప్రాన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bike accident, Corona, Medak Dist, Old man

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు