కలకత్తాలో ఘోరం జరిగింది. ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్న ఓ 73 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. అతడి ఇంట్లోకి దూరి, గొంతు కోసి మరీ చంపేశారు. అతడి తలను ప్రెజర్ కుక్కర్ తో ఛిద్రం చేశారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారు నగలను కూడా దొబ్బేశారు. అంతటితో ఆగక ఇంటి బయట తాళం పెట్టి ఎంచక్కా వెళ్లిపోయారు. అతడు ఇంట్లో లేరనే అంతా అనుకున్నారు. కానీ, అతడి కోడలికి అనుమానం రావడంతో విషయం బయటపడింది. పక్కింటివాళ్లతో కలిసి ఆ ఇంటి తలుపులను తీసి చూస్తే ఇంట్లో షాకింగ్ దృశ్యం కనిపించింది. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కలకత్తా నగరంలోని బౌబజార్ లోని ఫేర్స్ లేన్ లో అయూబ్ ఫైదా అలీ అఘా అనే 73 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనకు ఓ షాపు కూడా ఉంది. దాన్ని నిర్వహిస్తూ ఆ ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే ఈ శుక్రవారం రాత్రి అతడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చంపేశారు. అతడి ఇంట్లోకి దూరి గొంతు కోసం హతమార్చారు. ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్ తో అతడి తలను పగలగొట్టారు. ఇంట్లో దాదాపు రెండు లక్షల రూపాయలతో పాటు బంగారు నగలను కూడా దోచుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో అతడు ఊరికి వెళ్లిపోయాడనే అంతా భావించారు.
రెండ్రోజులుగా మామయ్య నుంచి ఫోన్ లేకపోవడం, అతడు ఎక్కడకు వెళ్లాడో తెలియకపోవడంతో ఫైదా అలీ ఇంటికి అతడి కోడలు వచ్చింది. ఫోన్ చేస్తే ఇంట్లో నుంచే రింగ్ టోన్ వినిపించడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో పక్కింటి వాళ్ల సాయం తీసుకుని ఆదివారం ఉదయం ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లిన వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. రక్తపు మడుగులో ఫైదా అలీ పడి ఉన్నాడు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో డబ్బుతో పాటు నగలుకూడా మాయమయ్యాయనీ, తాళం కూడా వేశారంటే తెలిసిన వాళ్ల పనే అయి ఉంటుందని ఫైదా అలీ కోడలు అనుమానం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Husband kill wife, Kolkata, Wife kill husband