ఇద్దరు రెస్టారెంట్ ఓనర్లకు 723 సంవత్సరాల జైలు శిక్ష.. వాళ్లు చేసిన నేరం ఏంటంటే..

723 years in prison | థాయిలాండ్‌లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

news18-telugu
Updated: June 13, 2020, 5:42 PM IST
ఇద్దరు రెస్టారెంట్ ఓనర్లకు 723 సంవత్సరాల జైలు శిక్ష.. వాళ్లు చేసిన నేరం ఏంటంటే..
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
థాయిలాండ్‌లో రెండు రెస్టారెంట్లకు చెందిన ఓనర్లకు స్థానిక కోర్టు 723 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సీఎన్ఎన్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. అపికార్ట్ బోవోర్బంచారక్, ప్రపాసార్న్ బోవోర్బాన్ రెస్టారెంట్లు తమ కస్టమర్లకు ఓ అద్భుత ఆఫర్‌ అంటూ భారీ ఎత్తున డిస్కైంట్ ఓచర్లను ఇచ్చాయి. ఆ వోచర్లను తీసుకొస్తే భారీ డిస్కౌంట్లు ఇస్తామని ప్రకటించాయి. సీ ఫుడ్ మీద అంటే పడిచచ్చే థాయిలాండ్ వాసులు ఆ వోచర్లను కొనుగోలు చేశారు. బఫెట్లో ఫుల్లుగా తినొచ్చని ఆఫర్ ఇవ్వడంతో పంట పండిందనుకున్నారు. వోచర్లు పొందిన వారంతా రెస్టారెంట్లకు వెళితే ఆ వోచర్లు చెల్లవంటూ రెస్టారెంట్ యజమానులు చేతులెత్తేశారు. డిస్కౌంట్ వస్తుందన్న ఆశతో వోచర్లు కొనుక్కుంటే, ఇప్పుడు చెల్లవంటే ఎలా కుదురుతుందని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి రెస్టారెంట్ల ఓనర్లుస్పందించలేదు. దీంతో కడుపు మండిన కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగింది 2019 సంవత్సరంలో. ఆ ఏడాది సెప్టెంబర్‌లో రెండు రెస్టారెంట్ల ఓనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి స్థానిక కోర్టులో విచారణ జరిపింది. మొదట వారికి 1446 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

అయితే, తాము చేసింది తప్పేనంటూ రెస్టారెంట్ల యజమానులు తమ తప్పు ఒప్పుకొన్నారు. దీంతో వారి శిక్షను సగానికి అంటే 723 సంవత్సరాలకు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అలాగే, 58,500 డాలర్ల జరిమానా విధించింది. అయితే, థాయిలాండ్ చట్టాల ప్రకారం ఓ వ్యక్తి 20 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత బయటకు విడుదల కావొచ్చు.
First published: June 13, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading