Home /News /crime /

7000 PEOPLE BOOKED FOR VIOLENCE AT KARNATAKAS IPHONE MANUFACTURING PLANT DETAILS HERE MS

జీతాలివ్వడం లేదని IPhone తయారీ కర్మాగారంలో ఆందోళనలు.. ఏడు వేల మందిపై కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు కర్మాగారం ముందు నానా హంగామా సృష్టించారు. సుమారు 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులతో పాటు.. రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఈ ఆందోళనలో భాగమయ్యారు.

  • News18
  • Last Updated :
    ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ Apple Iphone సంస్థలో ఇటీవల చోటుచేసుకున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్నాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఉన్న ఐఫోన్ తయారీ సంస్థ పై ఆందోళనకు దిగిన కార్మికులు.. అక్కడ విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో వేలాది ఫోన్లు, ల్యాప్టాప్ లు పాడయ్యాయి. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులతో సహా.. మొత్తం 7 వేల మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

    కర్నాటకలోని కోలార్ లో నరసాపుర వద్ద ఉన్న ఐఫోన్ తయారీ కర్మాగారంలో ఈ నెల 12న భారీ ఎత్తున హింస చెలరేగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు కర్మాగారం ముందు నానా హంగామా సృష్టించారు. సుమారు 5 వేల మంది కాంట్రాక్టు కార్మికులతో పాటు.. రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఈ ఆందోళనలో భాగమయ్యారు. కాగా.. యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు మధ్య చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆగ్రహించిన కార్మికులు.. సంస్థ లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.

    ఈ కంపెనీ ముఖ్యంగా ఐఫోన్లతో పాటు యాపిల్ ల్యాప్టాప్ లను తయారు చేస్తున్నది. లెనోవా, మైక్రోసాఫ్ట్, ఇతర ఐటీ ఉత్పత్తులను కూడా ఉత్పత్తి చేస్తున్నది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున తరలివచ్చన కార్మికులు.. అక్కడ ఉంచిన ల్యాప్టాప్ లు, ఫోన్లను, ఆఫీసులో ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోలామ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేశారు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో.. ఈ ఆందోళనలో పాల్గొన్న వారందరిపై కేసు బుక్ అయింది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Apple, Iphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు