96 ఏళ్ల తండ్రిని ఎలుకల మధ్య పడేసిన కూతురు... 74 ఏళ్ల కూతురికి జైలు...

96 ఏళ్ల వృద్ధ తండ్రిని ఎలుకల మధ్య, జంతువుల మధ్య పెట్టిన కన్నకూతుర్లు... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 23, 2019, 7:07 PM IST
96 ఏళ్ల తండ్రిని ఎలుకల మధ్య పడేసిన కూతురు... 74 ఏళ్ల కూతురికి జైలు...
72 ఏళ్ల కొడుకును తుపాకీతో కాల్చి చంపిన 92 ఏళ్ల వృద్ధురాలు... అతని ప్రియురాలిని...
  • Share this:
96 ఏళ్ల పండు ముసలి వయసు... తన పనులు తాను చేసుకోవడమే కాదు కదా... లేచి నిల్చోవడానికి కూడా సత్తువ లేని ముసలి వయసు. ఆ వయసులో ఉన్న తండ్రిని ఎలుకల మధ్య, జంతువుల మధ్య పెట్టారు కన్నకూతుర్లు. కన్నవారిపై కొడుకులకు ప్రేమ లేకపోయినా కూతుర్లకు మమకారం ఉంటుందంటారు. కానీ అదేమీ లేని ఇద్దరు కూతుర్లు... జంతువులతో పాటు ఓ పశువులా తండ్రిని చూసుకోవడం మొదలెట్టారు. ఆరోగ్య శాఖ అధికారులు ఆ ఇంటికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని వెంచురా కౌంటీ ఏరియాలో 96 ఏళ్ల వృద్ధుడితో కలిసి ఉంటున్నారు అతని ఇద్దరు కూతుర్లు. చిన్న కూతురి వయసు 65 ఏళ్లు కాగా, పెద్ద కూతురి వయసు 74 ఏళ్లు. ఈ ఏరియాలో ఉంటున్న పౌరుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతీ ఇంటికి తిరుగుతూ వివరాలు సేకరించారు అధికారులు. అందులో భాగంగా వృద్ధుడు ఉంటున్న ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే 65 ఏళ్ల చిన్నకూతురు బయటికి వచ్చింది. అధికారులు ఇంటిని పరిశీలించేందుకు అనుమతించలేదు.

దాంతో అనుమానం వచ్చిన అధికారులు... లోపలికి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. అప్పుడే బయటికి వచ్చిన 74 ఏళ్ల పెద్ద కూతురు, లోపలికి రానిచ్చేది లేదంటూ వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టింది. ఇద్దరి ప్రవర్తన వింతగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు అధికారులు. ఇంటికి చేరుకున్న పోలీసులు... సెర్చ్ వారెంట్ చూపించి, ఇంట్లోకి ప్రవేశించారు. లోపల కనిపించిన దృశ్యాలు చూసి, వారికి దిమ్మ తిరిగేంత షాక్ తగిలింది. ఇంటి నిండా రకరకాలు జంతువులు, పక్షులు కనిపించాయి. కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, చిలుకలు, అడవి ఎలుకలు... ఇలా రకరకాల జంతువులను బోనులో పెట్టి పెంచుతున్నారు అక్కాచెల్లెలు. మరో 700 ఎలుకలు ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో తండ్రిని పెట్టి, నరకం చూపించారు కూతుర్లు. అతని ఒంటిపై బట్టలు మొత్తం చినిగిపోయి, దాదాపు లేనట్టుగానే తయారయ్యాయి. బోనులో ఉన్న జంతువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు... దాదాపు నూరేళ్ల వయసున్న వ‌ృద్ధుడిని ఇలాంటి పరిస్థితుల్లో ఉంచినందుకు ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి తండ్రిని వృద్ధాశ్రమానికి తరలించారు.

First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading