ఓ 70 ఏళ్ల వృద్ధురాలు భిక్షాటన చేస్తూ బతుకుతోంది. ఇలా ఆమె యాచిస్తూ.. ఓ పాఠశాల భవనంలో నిద్రిస్తుండేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh) లో చోటు చేసుకుంది. మరో ఘటనలో కూడా 98 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్య(Murder)లు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ(Disha) లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు.
ఇది చదవండి: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..
ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్(Minor) బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇక్కడ జరిగిన ఘటనలు ప్రతీ ఒక్కరికీ ఆక్రోశాన్ని కలిగిస్తున్నాయి. రోజూ భిక్షాటన చేసుకొని ఆ ప్రాంతంలోనే ఉన్న ఓ పాఠశాలలో 70 ఏళ్ల వృద్ధురాలు ఉంటోంది. ఉత్తరప్రదేశ్( Uttara Pradesh) లోని ఫతేపూర్ (Fathepur) జిల్లాలోని తరిణవ్ పోలీస్ స్టేషన్ (Police Station) ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాల భవనంలో నిద్రించేది.
ఈ క్రమంలో ఓ రోజు రాత్రి అదే ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల లక్ష్మీ లోధి అనే వ్యక్తి మద్యం తాగొచ్చి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇదిలా ఉండగా.. బల్లియా జిల్లాలో 22 ఏళ్ల వ్యక్తి 98 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సోనూ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది. మొదట పోలీసులు దీనిపై కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఈ ఘటన ఆగస్టు 22 న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది చదవండి: అక్టోబర్ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..
ఈ విషయం సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ కాగా .. పోలీసులపై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. స్పందించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘటనలు స్థానికంగా తీవ్ర చర్చనీయాశం అయింది.
ఈ కామాంధులు వృద్ధులను కూడా వదిలిపెట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లకు రక్షణ(Security) లేకుండా పోయిందని.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల రక్షణ కొరకు కఠిన చట్టాలను తీసుకురావాలని వారు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, RAPE, Uttarapradesh