మూఢనమ్మకం.. పిల్లలు పుట్టాలని ఏడేళ్ల బాలికను కిరాతకంగా చంపించి అవయవాలు తిన్నారు

కాలం మారుతున్నప్పటికీ.. ఇంకా కొందరు మనుషుల మూఢనమ్మకాలను ఆచరిస్తూనే ఉన్నారు. వీరు పాటించే మూఢనమ్మకాలు చాలా కిరాతకమైన ఘటనలకు దారితీస్తున్నాయి.

news18-telugu
Updated: November 18, 2020, 7:48 AM IST
మూఢనమ్మకం.. పిల్లలు పుట్టాలని ఏడేళ్ల బాలికను కిరాతకంగా చంపించి అవయవాలు తిన్నారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కాలం మారుతున్నప్పటికీ.. ఇంకా కొందరు మనుషుల మూఢనమ్మకాలను ఆచరిస్తూనే ఉన్నారు. వీరు పాటించే మూఢనమ్మకాలు చాలా కిరాతకమైన ఘటనలకు దారితీస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని భద్రాస్‌లో మూఢ నమ్మకంతో కొందరు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. మైనర్ బాలిక శరీర అవయవాలు తింటే.. పిల్లలు పుడతారనే ఒక నమ్మకంతో అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికను బలి చేశారు. దీపావళి పండగ రోజు రాత్రి.. బాలికను గ్యాంగ్ రేప్ చేసి, ఆ తర్వాత హత్య చేసి.. అనంతరం ఆమె అవయవాలను తిన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పరుశురామ్, సునయన దంపతులకు 1999లో వివాహం జరిగింది. అయితే వీరికి సంతానం కలగలేదు. దీంతో పరుశురామ్ అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే పసిపిల్లల కాలేయం, గుండె తింటే.. పిల్లలు పుడతారనే ఎక్కడో చదివాడు. ఈ మూఢనమ్మకాన్ని ఆచరణలో పెట్టాడు.

ఎలాగైనా పసిపిల్లల ఆవయవాలు తినాలని అనుకున్న పరుశురామ్ తన ప్లాన్‌ను అమలు చేశాడు. తన మేనల్లుడు అంకుల్‌కు, అతని స్నేహితుడు బీరన్‌కు డబ్బులు ఇచ్చి బాలికను చంపాలని చెప్పాడు. దీంతో ఫుల్‌గా మద్యం సేవించిన అంకుల్, బీరన్‌లు.. శనివారం సాయంత్రం చాకెట్ల ఆశ చూపి ఓ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అతిదారుణంగా రేప్ చేసి.. చంపేశారు. అనంతరం బాలిక శరీరాన్ని కత్తితో కోశారు. కాలేయం, గుండెను తీసి వాటిని పరుశురామ్ దంపతులకు అందజేశారు. ఇక, బాలిక శరీరంలోని మిగతా అవయవాలను అక్కడే కుక్కలను పడేశారు.

మరోవైపు బయట ఆడుకుంటున్న బాలిక కనిపించకుండా పోయేసరికి ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలిక ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. అయితే ఆదివారం ఉదయం అక్కడికి సమీపంలో బాలిక అవయవాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అక్కడికి దగ్గర్లోని ఓ చెట్టు వద్ద బాలిక దుస్తులు, చెప్పులను గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరించారు. బాలికను హత్య చేయడానికి, అవయవాలు కోయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫోరెన్సిక్ నిపుణలను, డాగ్ స్వాడ్స్‌ను రంగంలోకి దించారు.

అనంతరం పరుశురామ్ దంపతులతో పాటుగా అంకుల్, బీరమ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక అవయవాలను తిన్న ప్రధాన నిందితుడు పరుశురామ్, అతని భార్య సునయిన తొలుత నేరాన్ని అంగీకరించలేదు. అయితే పోలీసుల విచారణలో చివరకు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఇక, ఈ దారుణ ఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఈ కేసును విచారణ జరపాలన్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 18, 2020, 7:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading