మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కామతో కళ్లుమూసుకుపోయి.. 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు.. కటోల్ తహసీల్లో ఓ గ్రామానికి చెందిన 7 ఏళ్ల బాలిక శనివారం సాయంత్రం ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాల మైదానంలో ఆడుకుంటుంది. అదే ప్రాంతానికి చెందిన అంకుష్ భోస్కర్ 25 ఏళ్ల వ్యక్తి బాలిక వద్దకు చేరుకున్నాడు. అనంతరం బాలికను పాఠశాల టాయిలెట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి.. పాఠశాల టాయిలెట్ వైపు నుంచి బాలిక అరుపులు వినిపించాయి. దీంతో వెంటనే అతడు బాలిక వద్దకు చేరుకుని ఆమెను రక్షించాడు.
అయితే నిందితుడు అంకుష్.. మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అంకుష్ భోస్కర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 376(ఎ)(బి), 506లతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు స్థానిక కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కోర్టు అతనికి మూడు రోజుల పోలీస్ కస్టడీ రిమాండ్ విధించింది.
ఇక, దేశంలో రోజురోజుకు మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిలో చాలా మంది మహిళలు, బాలికలకు తెలిసినవారు, చుట్టుపక్కల నివసించేవారే కావడం ఆందోళన కలిగిస్తోంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.