తెలంగాణలో దారుణం... ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారం

వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.

news18-telugu
Updated: October 15, 2019, 7:53 AM IST
తెలంగాణలో దారుణం... ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో దారుణం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఏడేళ్ల చిన్నారిపై పక్కిండి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ వ్యాధి ఉన్న యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల తెలిపిన ప్రకారం.. అశ్వారావుపేటలో ఓ మహిళ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. వారింటికి సమీపంలోనే ఉండే 23 ఏళ్ల యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఎయిడ్స్ వ్యాధి ఉంది. ఆ యువకుడు అప్పుడప్పుడు బాధితురాలి ఇంటికి టీవీ చూసేందుకు
వస్తూ ఉంటాడు.

ఈ నేపథ్యంలో సోమవారి మహిళ కుమార్తెకు జ్వరం రావడంతో... మందులు వేసి ఇంట్లో నిద్రపుచ్చింది. ఆ తర్వాత తల్లి కూలి పనులకు వెళ్లింది. తల్లి వెళ్లిపోయిన తర్వాత చిన్నారి ఇంటికి వెళ్లిన నిందితుడు ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంటికి తల్లి వచ్చి చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

First published: October 15, 2019, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading