ఏడేళ్ల చిన్నారి తల పగులకొట్టిన తల్లి ప్రియుడు... కేరళలో దారుణం...

4 ఏళ్ల తమ్ముడిని కొడుతుంటే, అడ్డం వెళ్లిన ఏడేళ్ల అన్న... కోపంతో బాలుడిపై దాడి చేసిన తల్లి ప్రియుడు... ఆరోగ్య పరిస్థితి విషమం, 48 గంటలు గడిస్తేనే గానీ ఏమీ చెప్పలేమని తేల్చేసిన వైద్యులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 8:20 PM IST
ఏడేళ్ల చిన్నారి తల పగులకొట్టిన తల్లి ప్రియుడు... కేరళలో దారుణం...
ఏడేళ్ల చిన్నారి తల పగులకొట్టిన తల్లి ప్రియుడు... కేరళలో దారుణం...
  • Share this:
ఆమెకు ఇద్దరు కొడుకులు. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయి, వేరుగా ఉంటోంది. మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే వేరే వ్యక్తికి పుట్టిన ఇద్దరు పిల్లలపై కసి పెంచుకున్న అతను... వారిని నిత్యం వేధించడం మొదలెట్టాడు. నాలుగేళ్ల చిన్నారిని కొట్టబోతుంటే అడ్డు వెళ్లిన అన్న తల పగుటకొట్టాడు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్రాకుళం జిల్లాలో వెలుగుచూసింది. ఎర్రాకుళంలోని కులెచెరీ ఏరియాలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల మహిళకు ఇద్దరు కొడుకులున్నారు. ఓ కొడుకు వయసు ఏడేళ్లు కాగా చిన్నోడి వయసు నాలుగేళ్లు. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా అతనితో వేరుపడి, 36 ఏళ్ల వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది ఆమె. అయితే ప్రియురాలి పుత్రులంటే అతనికి ఎప్పుడూ పడేది కాదు. తల్లి ఉన్నప్పుడు వారితో ఎంతో ప్రేమగా నటించే అతను... ఆమె లేని సమయంలో పిల్లలను కొడుతూ, తిడుతూ చిత్రవధ చేసేవాడు. ఆ వేధింపులన్నీ భరిస్తూ, మౌనంగా ఉండేవాళ్లు ఆ పసిపిల్లలు.

గురువారం ఓ చిన్నవిషయమై 4 ఏళ్ల చిన్నోడిని కొడుతూ వేధించడం మొదలెట్టాడు తల్లి ప్రియుడు. తమ్ముడిని కొడుతున్న అతనికి, అడ్డుగా వెళ్లాడు ఏడేళ్ల అన్న. అంతే తనకు అడ్డుగా వచ్చిన చిన్నోడిపై అతి కర్కశంగా దాడి చేశాడతను. అతని దాడిలో కిందపడిన కుర్రాడి తలకు తీవ్ర గాయం అయ్యింది. తలకు దెబ్బ తగిలి రక్తం వస్తున్నా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అలాగే వదిలేశాడు ఆ మానవత్వం లేని మనిషి. నాలుగేళ్ల చిన్నారిని కూడా చావబాది, బెడ్‌రూమ్‌కి వెళ్లి పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన తల్లి, కొడుకును గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. చిన్నారిని పరీక్షించిన వైద్యులు... తలకు దెబ్బ బలంగా తగలడం వల్ల పుర్రెకు పగులు వచ్చిందని తెలిపారు. గుండెల మీద కూడా తీవ్రంగా కొట్టడంతో ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. శరీరంలోపల రక్తనాళాలు చిట్లడం వల్ల మెదడుకు రక్తసరఫరా ఆగిపోయే ప్రమాదం ఉందని, ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, 48 గంటలు గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు. వైద్యుల నుంచి సమాచారం అందుకున్న చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులు... ఆసుపత్రికి చేరుకుని విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం చిన్నారిని ఎర్నాకుళం ఆసుపత్రికి తరలించారు. బాలుడి తమ్ముడి నుంచి ఏం జరిగిందో తెలుసుకున్న పోలీసులు... పిల్లలపై దాడి చేసి వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ కూడా బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పిల్లాడి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ తెలిపారు.

ఇది కూడా చూడండి :-
దేశానికి కొత్త ప్రధాని ఖాయం... జగన్‌కు కేసీఆర్, బీజేపీ సపోర్ట్... సీఎన్ఎన్ న్యూస్18 ఇంటర్వ్యూలో చంద్రబాబు
First published: March 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading