ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికీ ఏడేళ్లే..!

దేశంలో నేర ప్రవృత్తి నానాటికీ పెరిగిపోతున్నది. ఇది పెద్ద వాళ్లు, యువత లోనే కాదు.. చిన్న పిల్లల్లోనూ ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.

news18
Updated: October 21, 2020, 10:13 AM IST
ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికీ ఏడేళ్లే..!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 21, 2020, 10:13 AM IST
  • Share this:
పెద్దవాళ్లు చేసిన.. చేస్తున్న తప్పులో లేక ఇంటర్నెట్ కు బానిసలవండం మూలానో గానీ దేశంలో చిన్న పిల్లల్లో కూడా నేర ప్రవృత్తి పెరుగుతుండటం ఆందోళనకు దారి తీస్తున్నది. ఇప్పటికే లైంగికదాడులు, హత్యోదంతాలతో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్ లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సారి బాధిత, నిందితులిద్దరూ మైనర్లే.. వారి వయస్సు పదేండ్ల లోపే ఉండటం గమనార్హం. ఐదున్నరేళ్ల వయసున్న బాలికపై.. ఏడేళ్ల వయసున్న ఒక బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన యూపీలో వెలుగుచూసింది. అలీగఢ్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలివిగో..

అలీగఢ్ కు చెందిన ఒక బాలిక.. ఈ నెల 12న తన ఇంట్లో ఆడుకుంటుండగా బంతి వెళ్లి పక్కింట్లో పడింది. అక్కడ ఉన్న ఒక ఏడేళ్ల బాలుడు.. ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ బాలికను గట్టిగా పట్టుకుని.. అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కేకలు వేసిన ఆ బాలిక.. అక్కడ్నుంచి పారిపోయింది. ఇంట్లోకి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం


బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ మొదలుపెట్టారు. అయితే నిందితుడు మైనర్ కావడంతో ఈ కేసును జువనైల్ కోర్టుకు అప్పగించారు. ఈ మేరకు ఆ పిల్లవాడిని మంగళవారం జువనైల్ కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం


కాగా, లైంగిక వేధింపులకు సంబంధించి యూపీలో.. కొద్దిరోజులుగా వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచార కేసులు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. హత్రాస్ ఘటన వెలుగులోకి రావడంతో ఎక్కువైన ఆ పరంపర.. అలాగే కొనసాగుతూ వస్తున్నది. ఇక తాజాగా చిన్న పిల్లలు సైతం ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం విచారకరం.
Published by: Srinivas Munigala
First published: October 21, 2020, 10:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading