ఇద్దరు విద్యార్థినులపై లైంగిక వేధింపులు... ఏడుగురు టీచర్ల అరెస్టు

మన దేశంలో చట్టాలున్నాయా అన్న డౌట్ వస్తుంది చాలా మందికి ఇలాంటి ఘటనల గురించి తెలుసుకుంటే. ఆ దుర్మార్గుల ఉచ్చులో విద్యార్థినులు ఎలా చిక్కారో తెలుసుకుందాం. ఇకపై అలాంటివి జరగకుండా జాగ్రత్త పడదాం.

news18-telugu
Updated: November 9, 2019, 7:17 AM IST
ఇద్దరు విద్యార్థినులపై లైంగిక వేధింపులు... ఏడుగురు టీచర్ల అరెస్టు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
"మీరు కంప్లైంట్ చేశారో... మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం. మేం చెప్పింది చెప్పినట్లు వినండి. ఏం చేసినా... సైలెంట్‌గా చూస్తూ ఉండండి" ఇదీ ఆ బాలికలకు టీచర్లు పెట్టిన కండీషన్. 2018లో జరిగింది మొదటి ఘటన. టీచర్లలో ఒకడు... ఇద్దరు బాలికల్ని పిక్‌నిక్‌కి తీసుకెళ్లాడు. ఓ బాలికను రేప్ చేశాడు. ఈ ఘటన తర్వాత... మరో టీచర్ కన్ను రెండో బాలికపై పడింది. ఇలా... మొత్తం ఏడుగురు టీచర్లు ఇద్దరు బాలికల జీవితంతో ఆడుకున్నారు. ఈ ఘోరం జరిగింది ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో. మొత్తం ఏడుగురు టీచర్లనూ శుక్రవారం అరెస్టు చేశారు. ఏడాది కాలంగా వాళ్లు ఇద్దరు బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. పరీక్షల్లో తమను ఫెయిల్ చేస్తారన్న భయంతో ఆ బాధిత బాలికలు ఆ దుర్మార్గులు చెప్పినట్లు చేశారని దర్యాపులో తేలింది.

మొదటి బాలికను రేప్ చేసిన టీచర్... ఆ విషయాన్ని మరో టీచర్‌కు చెప్పాడు. ఆ రెండో టీచర్ కన్ను... మరో బాలికపై పడింది. ఆ బాలికను స్కూల్లో పాతబడిన భవనంలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే... పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఎవరికీ చెప్పకపోతే... ఏమీ కాదనీ... మంచి మార్కులు వస్తాయని చెప్పాడు. బాలిక బాగా భయపడింది. ఫెయిలైతే ఇంట్లో తిడతారనీ, స్కూల్ మాన్పించేస్తారనీ టెన్షన్ పడింది. ఇలా ఇద్దరు బాలికలూ టెన్షన్‌ పడుతుంటే... ఆ ఇద్దరు దుర్మార్గపు టీచర్లూ... తాము చేసిన నిర్వాకాన్ని మరో ఐదుగురు టీచర్లకు చెప్పారు. అందరూ కాట్లకుక్కల్లా తయారయ్యారు.

మేమూ ఛాన్స్ తీసుకుంటామంటూ... మిగతా ఐదుగురూ ఆ ఇద్దరు బాలికల్నీ టార్గెట్ చేశారు. తరచూ లైంగిక వేధింపులకు దిగారు. ఇలా ఏడుగురూ తమపై దాడి చేస్తుంటే... ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెయ్యాలో అర్థంకాక తమలో తామే విధివంచితుల్లా బాధపడ్డారు ఆ అభాగ్యురాళ్లు. చేసే పాడుపని ఎప్పటికైనా బయటపడి తీరుతుంది కదా. బాలికల్లో వస్తున్న మార్పులూ... వాళ్లలో భయాలను ఇంట్లో వాళ్లు గమనించారు. ఏం జరిగిందని ఓ రోజు గట్టిగా నిలదీస్తే... ఓ బాలిక... జరిగిందంతా చెప్పింది. ఆశ్చర్యపోవడం ఇంట్లో వాళ్ల వంతైంది. కట్ చేస్తే... బాలికను తీసుకొని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం... పోలీసులు దర్యాప్తు చేసి... జరిగిన దారుణాన్ని గుర్తించడం, కేటుగాళ్లైన ఏడుగురు టీచర్లనూ అరెస్టు చెయ్యడం అన్నీ జరిగాయి. ఎన్ని చట్టాలున్నా ఇలాంటి దారుణాలు ఆగట్లేదు. ఏం చేస్తే వీటికి అడ్డుకట్ట పడుతుందో...


ఏజెంట్ సాయి శ్రీనివాస మూవీ హీరోయిన్ శ్రుతి శర్మ క్యూట్ స్టిల్స్
ఇవి కూడా చదవండి :

Ayodhya Verdict : రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు... అయోధ్య కేసు తీర్పుపై ముందు జాగ్రత్తలుAyodhya Verdict : దేశవ్యాప్తంగా హైఅలర్ట్... అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పేంటి?

RTC Strike : నేడు ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్...

సీతాఫలంపై అపోహలు, నిజాలు... ఈ సీజన్‌లో ఎందుకు తినాలంటే...

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి
Published by: Krishna Kumar N
First published: November 9, 2019, 7:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading