హోమ్ /వార్తలు /క్రైమ్ /

Jammu: ఘోరం.. నదిలో పడిన ఆర్మీ బస్సు.. ఏడుగురు జవాన్ల దుర్మరణం..

Jammu: ఘోరం.. నదిలో పడిన ఆర్మీ బస్సు.. ఏడుగురు జవాన్ల దుర్మరణం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ladakh: లడఖ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు నదిలో పడింది.

జమ్ములోని లడఖ్ లో (Ladakh)  శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. సైనికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ష్యోక్ నదిలో  పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు సైనికుల మృతి (Soldiers Dead) చెందారు. బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అధికారులు సహయక చర్యలు చేపట్టారు.  లడఖ్ లోని థోయిస్ అనే ప్రాంతంకు కొద్ది దూరంలో బస్సు ప్రమాదం జరిగింది. వాహనం 50 నుంచి 60 అడుగులో లోతుకు పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారందరికి గాయాలయ్యాయి. లడఖ్ లోని తుర్టుక్ సెక్టార్ లోని ష్యోక్ నదిలో వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదం ఉదయం జరిగినట్లు తెలుస్తోంది.

పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళ్తున్న వాహనంలో 26 మంది సైనికులు (Soldiers) ఉన్నారు. కాగా, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ ఆస్పత్రికి తరలించారు. లేహ్ నుంచి ప్రత్యేక వైద్య బృందాలు పార్తాపూర్‌కు తరలించబడ్డాయి. గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించాలని అధికారులు వైద్యులను సూచించారు.

First published:

Tags: Jammu, Ladakh

ఉత్తమ కథలు