ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్... ఏడుగురు మావోలు హతం
రాజ్‌నంద్‌గాన్ జిల్లా సీతాగోట అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు, మావోలకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
news18-telugu
Updated: August 3, 2019, 12:33 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: August 3, 2019, 12:33 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. సీతాగోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మావోలపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందినట్లు తెలుస్తోంది. రాజ్‌నంద్‌గాన్ జిల్లా సీతాగోట అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు, మావోలకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని డీజీపీ డీఎం అవాస్తీ తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఏకే 41, 303 రైఫిల్స్, 12 బోర్ గన్స్, సింగిల్ షాట్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
జూలై 29న సుకుమా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. ఇందులో ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. ఎదయం ఏడు గంటల ప్రాంతంలో కొంటా పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ టీం సమాచారం అందుకొని ఎన్కౌంటర్ ఆపరేషన్ నిర్వహించింది. ఇద్దరు మావోలపై కాల్పులు జరిపి... ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతా గోట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తోన్న దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మెరుపువేగంతో వారిపై కాల్పులు జరిపి.. ఏడుగురిని హతమార్చరు.

ఇద్దరు బాలికలపై ఏడుగురు గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఓ మైనర్...
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు.. ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య.. వాహనాలకు నిప్పు
కొడుకు చనిపోతే ‘దినం’ భోజనాలు పెట్టలేదని గ్రామస్తుల దుశ్చర్య....
తమ్ముడి మాజీ లవర్‌పై అన్న దారుణం.. పెళ్లిచేసుకోమంటోందని..
Video : అడిగి మరీ కొరడాతో కొట్టించుకున్న సీఎం..
Loading...