హోమ్ /వార్తలు /క్రైమ్ /

Pregnant woman murder : బలి ఇచ్చేందుకు..గర్భిణిని చంపి, కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లారు!

Pregnant woman murder : బలి ఇచ్చేందుకు..గర్భిణిని చంపి, కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లారు!

బాధిత మహిళ

బాధిత మహిళ

Pregnant woman murder : ఓ గర్భిణీ దారుణ హత్యకు(Pregnant woman) గురైంది. అయితే ఆమె హత్యకు గల కారణం తెలుసుకున్న పోలీసులే షాక్ అయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pregnant woman murder : ఓ గర్భిణీ దారుణ హత్యకు(Pregnant woman) గురైంది. అయితే ఆమె హత్యకు గల కారణం తెలుసుకున్న పోలీసులే షాక్ అయ్యారు. మతపరమైన ఆచారాలను నెరవేర్చడానికి గర్భిణీ మహిళను హత్య చేసి ఆమె కడపులోని బిడ్డను దొంగలించారని పోలీసులు కనుగొన్నారు. బ్రెజిల్‌(Brazil) లో జరిగిన ఈ సంఘటన గురించి వింటేనే గుండె ఝల్లుమంటోంది.

డైలీ స్టార్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 21న బ్రెజిల్‌లోని సావో పాలోలోని పోర్టల్ డాస్ లాగోస్‌లో ఒహానా కరోలిన్ అనే 24 ఏళ్ల మహిళ మృతదేహం కనుగొనబడింది. ఒహానా ముగ్గురు పిల్లలకు తల్లి, ఆమె మరణించినప్పుడు గర్భవతిగా ఉండింది. మృతురాలు కేవలం టీ షర్టు మాత్రమే ధరించిందని, ఆమె ప్రైవేట్ పార్ట్ కూడా దెబ్బతిన్నదని పోలీసులు తెలిపారు. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. మహిళను దారుణంగా హత్య చేసి ఆమె కడుపు కోసి 7 నెలల శిశువును బయటకు తీసి పట్టుకెళ్లారు దుండగులు. ఏదో మతపరమైన ఆచారాలను నెరవేర్చడానికి మహిళను హత్య చేసి, ఆమె కడుపులోని చిన్నారిని తీసుకెళ్లి బలి ఇచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Boyfriend On Rent : బెంగళూరులో అద్దెకు బాయ్ ఫ్రెండ్ సర్వీసులు ప్రారంభం..ఆ పనికి గంటల లెక్కన ఫీజు

ఒహానా మృతదేహం దగ్గర కొన్ని డబ్బులు కూడా పడి ఉన్నాయని తెలిపారు. మృతదేహం దొరికిన ప్రాంతంలో చాలా చర్చిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 21న మధ్యాహ్నం 3 గంటల సమయంలో నల్లటి కారులో మహిళ కూర్చొని ఉండడాన్ని తాము చూశామని పలువురు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఒహానా తన భర్త నుండి విడిపోయి ఇప్పుడు తన ప్రియుడితో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Brazil, Crime news

ఉత్తమ కథలు