7 MEN ARRESTED FOR RAPING AND FILMING MINOR GIRL IN BENGALURU
Gang Rape : బాలికపై గ్యాంగ్ రేప్..వీడియోలు తీసి బ్లాక్ మెయిల్!
ప్రతీకాత్మక చిత్రం
Bengaluru Girl Gang Raped : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు.
Rape On Minor Girl : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా బెంగళూరులో. 16 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సిటీలోని యెలహంక ఏరియాలో ఈ ఘోరం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గత వారం బాలిక ఏడుస్తూ ఇంటికి రాగా ఏమైందని తల్లిదండ్రులు ప్రశ్నించారు. అయితే భయంతో మొదట కబాబ్లో కారం కారణంగా ఏడిచానని తెలిపింది బాలిక. కానీ ఆలస్యంగా బాలిక నుంచి సమాధానం రాబట్టిన తల్లిదండ్రులు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఈ నెల 5వ తేదీన యెలహంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ప్రధాన నిందితుడు బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడి ఘటనను వీడియో తీశాడని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ రేప్ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడని... అనంతరం ఆ వీడియోను తన స్నేహితులతో పంచుకున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ మళ్లీ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.