ఆటోను ఢీకొట్టి బావిలో పడిన బస్సు.. ఏడుగురు దుర్మరణం

ఘటనా స్థలంలో సహాయక చర్యలు

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొట్టిన ఓ బస్సు అదుపుతప్పి బావిలో పడిపోయింది.

  • Share this:
    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఆటోను ఢీకొట్టిన ఓ బస్సు..అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మరో 28 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    Published by:Shiva Kumar Addula
    First published: