Bus collide with truck : ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతిచెందగా,10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లఖింపూర్-బహ్రైచ్ రాష్ట్ర రహదారిపై తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
కర్ణాటక నుండి 16 మందితో కూడిన బస్సు అయోధ్యకు వెళ్లున్న సమయంలో మోతీపూర్ ప్రాంతంలో నానిహా మార్కెట్ వద్ద వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. నానిహా మార్కెట్ వద్ద ఆపోజిట్ లేన్ లోకి టూరిస్టు ప్రవేశించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అదనపు పోలీస్ సూపరింటెండ్ ఆశోక్ కుమార్ చెప్పారు. బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు యాత్రికులు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ALSO READ Church Food Event : చర్చి కార్యక్రమంలో తొక్కిసలాట..31మంది మృతి
ఈ ఘటన జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మోతీపుర్ పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలన్నింటినీ బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ట్రీట్మెంట్ కోసం జిల్లా హాస్పిటల్ కు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రావెలర్ వాహనం ఓవర్టేక్ చేస్తుండగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనపై విచారన చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు .ఈ ప్రమాదంలో మరణించిన వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Road accident, Uttar pradesh