Mysterious Illness In Rajastan : రాజస్తాన్ లో మిస్టరీ వ్యాధి(Mysterious Illness) కలకలం రేపుతోంది. సిరోహి జిల్లా ఫుల్ బాయి గ్రామంలో అభం, శుభం తెలియని చిన్నారులను అంతుచిక్కని వ్యాధి కబళిస్తుంది. ఆరు రోజుల్లో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ నెల 9 నుంచి 13 వరకు జ్వరం, మూర్ఛ వంటి లక్షణాలతో ఏడుగురు పిల్లలు(Childrens Died) మరణించినట్లు ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ జగేశ్వర ప్రసాద్ తెలిపారు. వీరు వ్యాధి సోకిన కేవలం రెండు, మూడు గంటల్లో చనిపోయినట్టు తెలిపారు. మరణించిన ఏడుగురులో రెండేళ్ల కంటే తక్కువ వయస్సు వారు ఇద్దరు ఉన్నారు. మిగిలినవాళ్లు 10 నుంచి 15 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలని చెప్పారు. చిన్నారుల మృతికి కారణం ఏమిటన్నది తెలియలేదని చెప్పారు. వైరల్ డిసీజ్ కారణం కావచ్చని, అయితే రక్త నమూనాల పరీక్షల రిపోర్టులు వస్తే గానీ ఏమీ చెప్పలేమన్నారు.
మరణించిన ఏడుగురు పిల్లల్లో ముగ్గురు స్థానికంగా తయారు చేసిన ఐస్ తిన్నట్లు తమకు తెలిసిందని ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ జగేశ్వర ప్రసాద్ తెలిపారు. మరో ఇద్దరు కూడా ఆ ఐస్ తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారని, అయితే ఎవరూ దీనిని చూడలేదన్నారు. విషాహారం వల్ల కూడా ఇంత వేగంగా మరణాలు సంభవించవని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదేళ్ల కుమారుడు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి మంచినీరు అడిగాడని, అనంతరం అతడికి మూర్ఛ వచ్చినట్లు తల్లి తెలిపిందన్నారు. ఉదయం 8 గంటలకు వాంతుల తర్వాత పిల్లవాడు చనిపోయినట్లు ఆమె చెప్పిందన్నారు.
ALSO READ Video Viral:బైక్ టచ్ అయినందుకు ఆ అమ్మాయి ఏం చేసిందో చూడండి
జైపూర్, జోధ్ పూర్ నుంచి ప్రత్యేక బృందాలను ఆ గ్రామానికి పంపుతున్నట్లు సిరోహి జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిస్థితిని గమనిస్తున్నామని, 300 ఇళ్ల నుంచి 58 మంది పిల్లల రక్త నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపినట్లు వెల్లడించారు. మరికొంత మంది చిన్నారులు కూడా జ్వరం, మూర్ఛలతో బాధపడుతున్నారని అధికారుల బృందం తెలిపింది. ఇంటింటికీ తిరిగి సర్వేలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే వైరల్ ఎన్సెఫాలిటిస్ వల్ల పిల్లలు మరణించినట్లు వైద్య బృందం, వైద్యులు అనుమానిస్తున్నారని సిరోహి కలెక్టర్ భన్వర్ లాల్ అన్నారు. అయితే ఈ విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. ఈ ఘటనపై రాజస్తాన్(Rajastan) ఆరోగ్య మంత్రి ప్రసాది లాల్ మీనా స్పందిస్తూ.. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మరణాలు సంభవించాయని తేలిందని చెప్పారు. కలెక్టర్ తో మాట్లాడానని..ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆరోగ్య మంత్రి చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.