ముద్దు మాటలతో ముసలాయనకు వల... అడ్డంగా ముంచేసిన యువతి...

Facebook Cheating : ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్... తన జీవితాన్ని మార్చేస్తుందనీ, ఓల్డ్ ఏజ్‌లో ఓ అమ్మాయి తోడు దొరికిందనీ అనుకున్నాడు. తీరా చూస్తే... అడ్డంగా బుక్ చేసి, అడ్డగోలుగా మోసం చేసిందా యువతి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 27, 2019, 11:20 AM IST
ముద్దు మాటలతో ముసలాయనకు వల... అడ్డంగా ముంచేసిన యువతి...
ఆన్ లైన్ చీటింగ్ (ప్రతీకాత్మక చిత్రం)
Krishna Kumar N | news18-telugu
Updated: May 27, 2019, 11:20 AM IST
హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉంటున్నాడు 68 ఏళ్ల రాజేశ్వరరావు (పేరు మార్చాం). రిటైర్ట్ ఉద్యోగి. ఇంటిదగ్గర ఉంటూ ఫేస్‌బుక్‌ చూస్తుండగా... ఏంజెలా డొనాల్డ్ అనే విదేశీ అమ్మాయి పరిచయమైంది. మెల్లగా పరిచయం కాస్తా ఫ్రెండ్షిప్ అయ్యింది. రోజురోజుకూ చాటింగ్ ఎక్కువైంది. ఒక్కోసారి గంటల తరబడి చాట్ చేసుకునేవాళ్లు. ఓ రోజు ఆమె ఫొటోలు పంపమన్నాడు. ఆమె కూడా ఆయన ఫొటోలు పంపమంది. ఇలా ఇద్దరూ ఫొటోలు మార్చుకున్నారు. మీ ఏజ్ ఎక్కువైనా ఫొటోల్లో అలా లేరే... నాకు మీరు బాగా నచ్చారు. ఐలవ్యూ అంది. విదేశీయురాలు కదా... చాలా ఫాస్ట్ అనుకున్నాడు. కమిట్ అయ్యాడు. నాకూ నువ్వంటే ఇష్టమే అన్నాడు. అలా ఫ్రెండ్షిప్ కాస్తా లవ్ మేటర్‌గా మారింది. ఇక్కడే అసలు ట్విస్ట్.

తన దగ్గర వేల కోట్లు ఉన్నాయన్న ఆమె... ఓ రూ.10 కోట్లు రాజేశ్వరరావుకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. తద్వారా రాజేశ్వరరావు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చంది. తన క్షేమం గురించి ఎంతో శ్రద్ధ చూపిస్తోంది అనుకున్నాడు. డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. మే 18న ఆయనకు రోహిత్ అనే కుర్రాడి నుంచీ కాల్ వచ్చింది. ఏంజెలా నుంచీ... తమ దగ్గరకు ఓ పెద్ద పార్శిల్ వచ్చిందనీ, అది ముంబై ఎయిర్‌పోర్టులో ఉందనీ చెప్పాడు. అందులో ఉన్న అడ్రెస్‌కి దాన్ని పంపాలంటే... ఇన్సూరెన్స్ ఛార్జీలు రూ.65,800 చెల్లించాలనీ, తాము చెప్పిన బ్యాంక్ అకౌంట్‌లో మనీ డిపాజిట్ చెయ్యాలనీ చెప్పాడు.


వచ్చేవి పది కోట్లు, అడిగింది 65,800. చాలా తక్కువే అనుకున్నాడు రాజేశ్వరరావు. వెంటనే ఆ డబ్బును అకౌంట్‌లో డిపాజిట్ చేశాడు. మర్నాడు మళ్లీ రోహిత్ కాల్ చేశాడు. ఇన్సూరెన్స్ కోసం మనీ ఇచ్చారు సరే... మీరు కస్టమ్స్ క్లియరెన్స్ మనీ చెల్లించలేదంట కదా అని అడిగాడు. ఆ విషయం తనకు తెలియదన్న రాజేశ్వరరావు... ఎంత చెల్లించాలని అడిగాడు. రూ.2లక్షల 35వేలు చెల్లిస్తే పార్సిల్ పంపిస్తామన్నాడు. వచ్చేవి పది కోట్లు. ఆల్రెడీ పోయినవి 65,800 కోట్లు. ఇప్పుడు అడిగినవి రూ.2.35 లక్షలు. తక్కువే అడిగారు అనుకుంటూ... ఆ డబ్బు కూడా డిపాజిట్ చేశాడు.

రెండ్రోజుల తర్వాత ఆయనకు ఓ మెయిల్ వచ్చింది. అది రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచీ వచ్చినట్లుగా ఉంది. మెయిల్ ఓపెన్ చేసి చూశాడు. అందులో లింక్ క్లిక్ చేయమని ఉంది. క్లిక్ చేశాడు. ఇక మీ అకౌంట్‌లోకి రూ.10 కోట్లు వస్తాయి అని మెసేజ్ కనిపించింది. ఇప్పటికీ డబ్బు రాలేదు. రోహిత్‌కి కాల్ చేస్తే, స్విచ్ఛాఫ్ అని వస్తోంది. ఫేస్‌బుక్‌లో చూస్తే ఆమె అకౌంట్ కనిపించట్లేదు. అప్పుడు అర్థమైంది రాజేశ్వరరావుకి తనను ఆ అమ్మాయి ముంచేసిందని. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశాడు. ఇలాంటి చాలా నేరాలు జరుగుతున్నాయి. అలర్ట్‌గా ఉండకపోతే, మన డబ్బుకి రెక్కలొచ్చినట్లే.



 

ఇవి కూడా చదవండి :

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు...

Loading...
ప్రకాశం జిల్లాలో క్రాస్ ఓటింగ్... కుదేలైన టీడీపీ నేతలు

కృష్ణా జిల్లా నుంచీ ఇద్దరికి మంత్రి పదవులు... క్యూలో ఆశావహులు...

టీడీపీలో 'కుల'కలం.. వైసీపీకి జైకొట్టిన బీసీలు... దెబ్బకొట్టిన జనసేన...
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...