పిల్లలు కందామంటూ యువతికి వేధింపులు.. హైదరాబాద్‌లో వృద్ధుడి అరెస్ట్

స్వరూపరాజు, ఆ మహిళ మధ్య నాలుగున్నర లక్షలకు ఒప్పందం కుదిరింది. అంతేకాదు పిల్లలు పుట్టేవరకు ఆమెకు నెలకు రూ.10వేలు కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.

news18-telugu
Updated: February 20, 2020, 3:09 PM IST
పిల్లలు కందామంటూ యువతికి వేధింపులు.. హైదరాబాద్‌లో వృద్ధుడి అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పిల్లలను కందామంటూ ఓ మహిళను వృద్ధుడు వేధించాడు. కృత్రిక గర్భధారణకు మొదట ఒప్పందం జరిగినా.. ఆ తర్వాత మాట మార్చిన అతడు సహజంగానే పిల్లలు కందామంటూ ఒత్తిడి తెస్తున్నాడు. ఆ వృద్ధుడి టార్చర్ భరించలేక భర్తతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వరూపరాజు (64) అనే వ్యక్తి పంజాగుట్ట పరిధిలోని ఆనంద్ నగర్‌లో నివసిస్తున్నాడు. అతడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. తన వంశాన్ని నిలబెట్టే మగపిల్లాడు లేడని నిత్యం బాధపడేవాడు.

ఈ క్రమంలో సరోగసి ద్వారా మగబిడ్డను కనేందుకు ఓ మధ్యవర్తిని కలిశాడు. ఫిబ్రవరి 11 నూర్ అనే మధ్యవర్తిని కలిసి డీల్ కుదుర్చుకున్నాడు. నూర్ తనకు పరిచయం ఉన్న 22 ఏళ్ల ఓ మహిళను కలిసి విషయం చెప్పగా... సరోగసి (కృత్రిమ గర్భధారణ) పద్దతిలో సంతానం కనేందుకు అంగీకరించింది. ఈ విషయమై స్వరూపరాజు, ఆ మహిళ మధ్య నాలుగున్నర లక్షలకు ఒప్పందం కుదిరింది. అంతేకాదు పిల్లలు పుట్టేవరకు ఆమెకు నెలకు రూ.10వేలు కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చాడు.

అనంతరం ఒక్కసారిగా మాటమార్చిన స్వరూప రాజు.. కృత్రిమ పద్దతిలో వద్దు.. సహజంగానే పిల్లలను కందామంటూ వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలను కనేందుకు తనతో సెక్స్ చేయాలంటూ ఒత్తిడి చేశాడు. స్వరూపరాజు వేధింపుల విషయాన్ని భర్తకు చెప్పి కన్నీటిపర్యంతమైంది బాధితురాలు. అనంతరం ఇద్దరు కలిసి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు స్వరూపరాజును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. మధ్యవర్తి నూర్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు