HOME »NEWS »CRIME »63 year old gujarat farmer ready to knot 7th wife because his 6th biwi refused to sex srd

Gujarat : 63 ఏళ్ల నిత్య పెళ్లికొడుకు..ఆరో భార్య కోరికలు తీర్చలేదని ఏడో పెళ్లికి సై..

Gujarat : 63 ఏళ్ల నిత్య పెళ్లికొడుకు..ఆరో భార్య కోరికలు తీర్చలేదని ఏడో పెళ్లికి సై..
ప్రతీకాత్మక చిత్రం

Gujarat : అతనిది విలాసవంతమైన జీవితం. ఇప్పటికే ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వయసు గురించి మాత్రం అడగకండి. అతగాడి వయస్సు 63 ఏళ్లు. అతగాడు అనడం కన్నా తాత గారు అనడం కరెక్ట్. ఈయన గారి రోగాల చిట్టా గురించి చెప్పాలంటే కష్టమే. సకల రోగాలతో సతమవుతూనే 63 ఏళ్ల నిత్య పెళ్లి కొడు ఏడో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు.

  • Share this:
    అతనిది విలాసవంతమైన జీవితం. ఇప్పటికే ఆరు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వయసు గురించి మాత్రం అడగకండి. అతగాడి వయస్సు 63 ఏళ్లు. అతగాడు అనడం కన్నా తాత గారు అనడం కరెక్ట్. ఈయన గారి రోగాల చిట్టా గురించి చెప్పాలంటే కష్టమే. సకల రోగాలతో సతమవుతూనే 63 ఏళ్ల నిత్య పెళ్లి కొడు ఏడో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ ధనిక రైతు, తన కంటే వయసులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఆరో భార్య కోరికలు తీర్చడం లేదని ఏడో పెళ్లికి సిద్ధమయ్యాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఓ వితంతువును ఆరో వివాహం చేసుకున్న అతను..కరోనా కారణంగా ఆమె దూరం పెట్టడంతో డిసెంబర్‌ నెలలో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. తనకు గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్‌, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయని, తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని, అందుకే తను మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన్నది అతని వాదన. ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్యపెళ్లి కొడుకు బాగోతాలు బయటపడ్డాయి. ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితోనూ ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఎరగా చూపి వివాహం చేసుకొని, వాడుకొని వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది.

    నిందితుడు తన గత వివాహాల గురించి తన వద్ద దాచి పెట్టి వివాహం చేసుకున్నాడని, పెళ్లి సందర్భంగా తనకు ఇస్తానన్న నగదు, ఇళ్లు కూడా ఇవ్వలేదని బాధిత మహిళ ఆరోపించింది. అయితే, అతని మొదటి భార్య.. 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయస్కులైన తన సంతానంతో కలిసి అదే గ్రామంలో ఉంటుందన్న విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిపై 498-A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే , తమ ఆచార వ్యవహారాల్లో ఇలా వివాహాలు చేసుకోవడం కరెక్టేనని నిందితుడు వాదించడం కొసమెరుపు. మొత్తానికి ఈ తాత గారు చర్యలు చూసి పోలీసులు ముక్కు మీద వేలుసుకున్నారు.

    Published by:Sridhar Reddy
    First published:January 25, 2021, 19:14 IST

    टॉप स्टोरीज