Home /News /crime /

61 YEAR OLD MUMBAI MAN DIES DURING ROMANCE WITH PARTNER IN HOTEL PVN

OMG : 40 ఏళ్ల మహిళతో శృంగారం చేస్తూ..ప్రాణాలు కోల్పోయిన 61 ఏళ్ల వృద్ధుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man Dies During Romance : మహిళతో శృంగారంలో పాల్గొంటూ.. ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం ప్రాణాలు వదిలాడు. ఉదయం 10 గంటల సమయంలో 61 ఏళ్ల వృద్ధుడు..40 ఏళ్ల మహిళతో కలిసి సబర్బన్ కుర్లాలోని హోటల్‌ లో రూమ్ తీసుకున్నాడు.

Man Dies During Romance : మహిళతో శృంగారంలో పాల్గొంటూ.. ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం ప్రాణాలు వదిలాడు. మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం...సోమవారం ఉదయం 10 గంటల సమయంలో 61 ఏళ్ల వృద్ధుడు..40 ఏళ్ల మహిళతో కలిసి సబర్బన్ కుర్లాలోని హోటల్‌ లో రూమ్ తీసుకున్నాడు. ఆమెను తన ప్రేయసిగా పేర్కొన్నాడు. ఆ తర్వాత కొంత సయమానికి హోటల్‌ రిసెప్షన్‌కు ఆ మహిళ ఫోన్‌ చేసి.. వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడని, ఎలాంటి స్పందన లేదని చెప్పింది. దీంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు. వృద్ధుడిని సియాన్ లో ఓ సివిక్ హాస్పిటల్ కి తరలించారు.

అయితే అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఆ మహిళను కుర్లా పోలీస్‌ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా.. వృద్ధుడు వర్లి ప్రాంతానికి చెందిన వాడని, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు,లైంగిక చర్యలో ఉండగా వృద్ధుడు మద్యం తాగేందుకు ప్రయత్నించాడని, కానీ అచేతన స్థితిలో పడిపోయాడని ఆమె చెప్పినట్టు కుర్లా పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ఏడీఆర్‌ (Accidental Death Report)గా కేసు నమోదు చేశామని, వృద్ధుడి మరణానికి కచ్చితమైన కారణాలు, లైంగిక చర్యలో పాల్గొనడానికి ముందు అతడు ఏమైనా ట్యాబ్లెట్లు తీసుకున్నాడా అనే విషయం తెలుసుకొనేందుకు మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ALSO READ  Beggar gifts wife :భార్యపై ప్రేమతో..90వేల రూపాయలతో మోపెడ్ కొన్న బిచ్చగాడు

మరోవైపు,మద్యం మత్తులో కొందరు (Drunkard) రెచ్చిపోతుంటారు. నడిరోడ్డుపై వీరంగం వేస్తుంటారు. అక్కడున్న వారిని ఇష్టమొచ్చినట్లు తిడుతూ.. అనవసరంగా గొడవ పెట్టుకొని.. నానా నానా రచ్చ చేస్తుంటారు. మందు నిశాలో అసలు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అంతగా తమపై తాము నియంత్రణ కోల్పోయి హద్దు మీరుతుంటారు. ఇలాగే సికింద్రాబాద్‌ (Secunderabad)లో ఓ వ్యక్తి మద్యం మత్తులో న్యూసెన్స్ చేశాడు. నగ్నంగా తిరుగుతూ ఇరుగుపొరుగు వారికి ఇబ్బందులు కలిగించాడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో పరచగా.. 112 రోజులు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పకనే చెప్పారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని కార్ఖానా బస్తీలో నివసించే మహ్మద్ సలీం తాగుడకు బానిసయ్యాడు. ప్రతిరోజూ అదే పని. తాగడం.. కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకోవడం.. ఇది నిత్యకృత్యంగా మారింది. మహ్మద్ సలీం రోజూ మందు తాగి వచ్చి.. కాలనీలో హల్ చల్ చేస్తుంటాడు. కుటుంబ సభ్యులపై దాడి చేస్తూ.. అడ్డుకునేందుకు వచ్చిన వారిపై విరుచుకుపడుతుంటాడు. బండ బూతులు తిడుతూ చెలరేగిపోతుంటాడు.

ALSO READ Viral Video : సపర్యలు చేసి..జింక ప్రాణాలు కాపాడిన గ్రామస్తులు

అప్పుడప్పుడూ నగ్నం రోడ్డు మీదకు వచ్చి.. స్థానికులు, వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తాడు. స్థానికులు ఎన్నోసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఐతే అతడితో పోలీసులకు కూడా తలనొప్పే. రోడ్డు మీదే కాదు..జైల్లో కూడా రెచ్చిపోతుంటాడు మహ్మద్ సలీం. పీఎస్‌లో గోడకు తలను బాదుకోవడం.. చేతులు కోసుకోవడం వంటివి చేస్తుంటాడు. అతడిపై ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఎంత మంచిగా నచ్చజెప్పినా.. పోలీసులు తీవ్రంగా హెచ్చరించినా.. మహ్మద్ సలీం ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి రెచ్చిపోయాడు సలీం. మద్యం తాగి తల్లిదండ్రులను కొట్టాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన చుట్టుపక్కల వారిని దుర్భాషలాడారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పోలీసులకు సమాచారం వెళ్లింది. వారు బస్తీకి చేరుకొని సలీంకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మనోడు వినడుగా..! పోలీసులకే చుక్కల చూపించాడు. వారితోనూ అభ్యంతరకరంగా ప్రవర్తించి.. విధులకు ఆటంకం కలిగించాడు. మీరు చెబితే నేను వినాలా.. నన్నెవ్వరూ ఏం చేయలేరు అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఎంత చెప్పినా మారకపోవడంతో.. పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. సలీంపై నగర పోలీస్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు పెట్టారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు చేయించి.. సోమవారం 13వ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. చార్జ్‌షీట్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా.. సలీం చర్యలను తీవ్రంగా పరిగణించారు మెజిస్ట్రేట్. ఈ క్రమంలోనే అతడికి 112 రోజుల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Man died, Mumbai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు