61 Killed In DR Congo Train Accident : కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైలుకు 15 బోగీలు ఉండగా...ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 11:50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఇప్పటి వరకూ 61 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 52 మంది గాయపడ్డారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక గవర్నర్ ఫిఫీ మసుకాను తెలిపారు. ఏడు మృతదేహాలను బాధిత కుటుంబాలు అప్పగించమనీ, మరో 53 మృత దేహాలను గుర్తిస్తున్నారని స్థానిక అధికారి జీన్-సెర్జ్ లుము విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
ALSO READ Video : జనాలపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు..ఎమ్మెల్యేను చితకబాదిన ప్రజలు
కాంగోలో ప్యాసింజర్ రైళ్లు లేక వెళ్లేందుకు వీలుగా రోడ్లు లేకపోవడంతో ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు. గత అక్టోబర్‌లో ఇదే ప్రావిన్స్‌లోని ముత్సత్షా ప్రాంతంలోని కెంజెంజ్ నగరంలో రైలు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు.2019లో, కసాయి ప్రావిన్స్‌లోని బెనా లేకా సెటిల్‌మెంట్‌లో స్టోవావేలను తీసుకువెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో జరిగిన ప్రమాదంలో 24 మంది మరణించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Train accident