షాకింగ్.. సంచిలో శవం.. పైన కూరగాయలు.. టాక్సీలో తరలిస్తుండగా..

ఓ గోనె సంచిలో శవాన్ని కుక్కి పైన కూరగాయలు నింపారు. కూరగాయలు తరలిస్తున్నట్లుగా చెప్పి ట్యాక్సీని మాట్లాడుకున్నారు.

news18-telugu
Updated: August 15, 2020, 10:42 PM IST
షాకింగ్.. సంచిలో శవం.. పైన కూరగాయలు.. టాక్సీలో తరలిస్తుండగా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది కోల్‌కతాలోని చోబాగా ప్రాంతం. శుక్రవారం రాత్రి రోడ్లపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ట్యాక్సీ వచ్చింది. కారు ఆపిన పోలీసులు డిక్కీని ఓపెన్ చేసి చూపించమన్నారు. అందులో కూరగాయల సంచి కనిపించింది. ఐతే సంచిలో మనిషి తలభాగం కొంత కనిపించడంతో పోలీసులు మొత్తం విప్పిచూశారు. కూరగాయల మధ్య నుంచి శవం బయటపడింది. ఆ వెంటనే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..

అసలేం జరిగిందంటే..

కోల్‌కతాలోని హరిదేవ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సుజామణి స్థానికంగా ఉన్న కాలిఘాట్ గుడి దగ్గర పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సుజామణికి, ఆమె కోడలు సుజాతకు మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం సుజాత, ఈమె తల్లి మలినా మండల్‌, మరో వ్యక్తి కలిసి సుజామణిని ప్రగతి మైదాన్‌లోని వారి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని వడ్డించారు. స్పృహ తప్పిన తర్వాత తలపై కర్రలతో బలంగా కొట్టారు. అంతటితో ఆగక ఆమెను గొంతునులిమి చంపేశారు.

సుజామణి మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఏం చేయాలన్న దానిపై ఆలోచించారు. ఆ తర్వాత ఓ గోనె సంచిలో శవాన్ని కుక్కి పైన కూరగాయలు నింపారు. కూరగాయలు తరలిస్తున్నట్లుగా చెప్పి ట్యాక్సీని మాట్లాడుకున్నారు. డిక్కీలో సంచి ఉంచి రోడ్డుపై వెళ్తుండగా.. చోబాగా ప్రాంతంలో పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. శవం బయటపడడంతో కారు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. కోడలు సుజాతే హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సుజాతతో పాటు మలీనా, అజయ్, బస్ మోండల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో టాక్సీ డ్రైవర్ ప్రమేయం లేదని తెలిసి అతడిని వదలిపెట్టారు.
Published by: Shiva Kumar Addula
First published: August 15, 2020, 10:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading