తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. పెద్దమ్మపై యువకుడి హత్యాచారం

మంగళవారం ఉదయం పొరుగింటిలో ఉన్న మహిళ ఆమె ఇంటికి వచ్చి పిలిచింది. ఎంతుకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూసింది.

news18-telugu
Updated: December 4, 2019, 8:12 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం.. పెద్దమ్మపై యువకుడి హత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రోజురోజుకు మానవుడు తాను మనిషినన్న విషయం మరిచిపోతున్నాడు. మృగాడులా మారి... కంటికి రెప్పాలా కాపాడాల్సినవారిని కాటేస్తున్నారు. కన్నపిల్లలపై కొందరు కిరాతకులు తన పైశాచికత్వం ప్రదర్శిస్తే.. మరికొందరు నీఛులు వరుసగా తల్లి, పెద్దమ్మ అయిన వారిని కూడా కామంతో కళ్లు మూసుకొని కాటేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. వరుసకు పెద్దమ్మ అయిన వ్యక్తిని ఓ యవకుడు అత్యాచారం చేసి ఆపై హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 60ఏళ్లు వృద్ధురాలు.. భర్త మరణించడంతో వింతతు పింఛనుతో జీవితం గడిపేది. మంగళవారం ఉదయం పొరుగింటిలో ఉన్న మహిళ ఆమె ఇంటికి వచ్చి పిలిచింది. ఎంతుకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూసింది. అయితే మంచంపై విగతజీవిగా పడి ఉన్న ఆమెను చూసి వెంటనే... పోలీసులకు సమాచారం అందించారు.

జిల్లా ఎస్పీ నయిం వెంటనే ఘటనస్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్‌టీంని రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్‌తో తీసుకురావడంతో అది... మృతురాలి ఇంటి నుంచి మొదలై... నాగబాబు అనే వ్యక్తి ఇంటి వద్ద ఆగింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అతడే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తాగిన మత్తులో ఆమెపై అత్యాచారం చేసి ఆ తర్వాత హతమార్చినట్లు అంగీకరించాడు. ఈ కేసులో గేదెల రాము, వర్రే బాబి అనే మరో ఇద్దరి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>