హోమ్ /వార్తలు /క్రైమ్ /

Telangana: ఉదయం సమాధిలో పాతిపెట్టిన శవం.. రాత్రవగానే రోడ్డు పక్కన పడిఉంది.. అసలేం జరిగింది?

Telangana: ఉదయం సమాధిలో పాతిపెట్టిన శవం.. రాత్రవగానే రోడ్డు పక్కన పడిఉంది.. అసలేం జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోడ్డు పక్కన బుచ్చమ్మ శవం కనిపించడంతో కొందరు గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన పరుగెత్తికొచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాధిలో ఉండాల్సిన శవం బయటకు ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. ఆ దృశ్యాలను చూసి వారు షాక్ తిన్నారు.

ఇంకా చదవండి ...

ఉదయం సమాధిలో పాతిపెట్టిన మృతదేహం రాత్రవగానే రోడ్డు పక్కన పడి ఉంది. పాడె నడిరోడ్డుపై కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు గజగజా వణికిపోయారు. సమాధిలో ఖననం చేసిన మృతదేహం బయటకు ఎలా వచ్చిందని భయపడిపోయారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాక్ తిన్నారు. నల్గొండ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (60) అనారోగ్య సమస్యలతో శుక్రవారం మరణించింది. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామంలోని ఓ ఖాళీ ప్రదేశంలో తమ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. ఐతే శుక్రవారం మధ్యాహ్నం పాతిపెట్టిన శవం.. రాత్రివేళ రోడ్డుపక్కన కనిపించింది. అదే గ్రామానికి చెందిన దంపతులు సమాధిని తవ్వి మృతదేహాన్ని వెలికితీసి బయట పడేశారు. పాడెను రోడ్డుపై విసిరేశారు.

రోడ్డు పక్కన బుచ్చమ్మ శవం కనిపించడంతో కొందరు గ్రామస్తులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన పరుగెత్తికొచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమాధిలో ఉండాల్సిన శవం బయటకు ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. ఆ దృశ్యాలను చూసి వారు షాక్ తిన్నారు. కుక్కలు, ఇతర జంతువులు తవ్విన ఆనవాళ్లు కూడా లేవు. ఎవరో ఉద్దేశపూర్వంగా తవ్వి బయటకు తీసినట్లు గుర్తించారు. ఇంతలోనే అదే గ్రామానికి చెందిన ఓ జంట ఈ పనిచేసిందని.. శవాన్ని బయటకు తీస్తుండగా తాము చూసినట్లు కొందరు వ్యక్తులు చెప్పారు. బుచ్చమ్మ మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసినవారి వద్దకు వెళ్లి.. ఆమె కుటుంబ సభ్యులు గొడవపెట్టుకున్నారు. ఇంత దారుణానికి ఒడిగడతారా? అని మండిపడ్డారు.

ఐతే తమ వంశానికి చెందిన వారి సమాధుల కోసం భూమిని ఖాళీగా ఉంచామని.. అక్కడ బుచ్చమ్మ మృతదేహాన్ని ఎందుకు ఖననం చేశాని ఆ దంపతులు నిలదీశారు. తమ అనుమతి లేకుండా ఎలా పూడ్చిపెట్టారని ప్రశ్నించారు. అందుకే శవాన్ని బయటకు తీసినట్లు వెల్లడించారు. ఐతే ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నా.. ఆ స్థలంలో గోతిని తవ్వుతున్నా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అక్కడ ఎందుకు ఖననం చేస్తున్నారని ప్రశ్నించలేదు. కానీ అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. రాత్రిపూట మృతదేహాన్ని బయటకు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Nalgonda, Telangana

ఉత్తమ కథలు